Tuesday, 4 June 2013

HARI THE HERO: My Take on Iddarammayilatho

HARI THE HERO
Oka Cinema Pichodu
thumbnail My Take on Iddarammayilatho
Jun 4th 2013, 11:19



2007 లో అల్లు అర్జున్ ని దేశముదురు అనే మాస్ టైటల్ పెట్టి ఇండస్ట్రీ లో బన్నీ ని కమర్షియల్ గా స్టార్ గా ప్రూవ్ చేసిన పూరీ జగన్నాథ్ ఈ సారి ఇద్దరమ్మాయీలతో అనే సాఫ్ట్ టైటల్ తో మన ముందుకి వచ్చారు, ఈ మద్య కాలం లో ఎన్నో మార్పులు, బన్నీ రేంజ్ పెరుగుతూ వచ్చింది, పూరీ మీద నమ్మకం తగ్గుతూ వచ్చింది, ఏది ఏమైన నా సినిమా ముహూర్తం పెట్టిన రోజే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయే మన బండ్ల గణేష్ గారి భారి ప్రొడక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యం లో వచ్చిన ఈ ఇద్దరమ్మాయిలతో ఎలా ఆడుతోంది అనేది ఆల్రెడీ తెలిసిన విషయమే కాబట్టి రిసల్ట్ తో సంబంధం లేకుండా సినిమా ఎలా ఉందొ, ఎవరు ఎలా చేశారో చర్చించుకుందాం. 

ఎప్పుడు చెప్పేదే అయినా సినిమా ముందు వేసే ముకేశ్ రీల్ టైపు లో, సినిమా చూసిన వాళ్ళకి మాత్రమే ఈ సమీక్ష, చూడాలి అనుకునే వాళ్ళు చూసిన తర్వాత చదవండి, చదివి డిసైడ్ అవుతాం లే అనుకుంటే ఇక్కడే ఆపేసి లాస్ట్ పేరాగ్రాఫ్ కి వెళ్ళిపొండి. 



కళాకారుల పనితీరు: 

ఇద్దరమ్మాయిలు: టైటిల్ ఏ వీళ్ళ పేరు మీద ఉంది కాబట్టి ముందు వీళ్ళతో స్టార్ట్ చేద్దాం, అమలా పాల్ చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది, ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అయినా చెప్పుకునే అనే అంత గొప్ప సీన్స్ లేక పోవటం వలన సింపుల్ గా తేలిపోయింది, మేకప్ దారుణం, మొదట్లో సాదా సీదా గా మొదలై, రివెంజ్ రేంజ్ కి ఎదిగే క్యారెక్టర్ లో, తొలి సగం బాగానే చేసినా, ఆ తర్వాత సగం చెయ్యలేక పోయింది, బన్నీ తో కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కౌట్ చేసింది. ఇంక రెండో అమ్మాయి క్యాథరీన్ విషయానికి వస్తే ఈమెకి పావలా ఇచ్చారో లేదో తెలియదు కానీ రూపాయి ముప్పావలా ఫెర్ఫార్మన్స్ మాత్రం ఈవిడ  మనకి ఇచ్చింది. విచ్చలవిడి గా అందాలూ అరబోయటం తప్ప చెప్పుకోటానికి ఏమి లేదు, దీనిని బట్టి ఎం అర్ధం అవుతుంది? ఈవిడ స్క్రీన్ మీద ఉన్నప్పుడు, మనం విల్లు పట్టుకున్న అర్జునుడి లా, ఎక్కడ concentrate చెయ్యాలి అని మాత్రం తెలుసుకుంటే చాలు. :) ఇంకేమి కనపడకూడదు...  వేరే ఏమి వినపడకూడదు :)

అబ్బాయి: విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ, యువ సామ్రాట్, స్టైలిష్ స్టార్, అసలేంటి ఎం చెప్పాలి అనుకుంటున్నావ్, దేనితో మొదలు పెడుతున్నావ్ అని అనాలి అనుకుంటే మళ్ళి చదవండి, కొందరికి కొన్ని పేర్లు వాళ్ళ కోసమే పుట్టినట్టు ఉంటాయి (బేసిక్ ఐడియాముద్ర అనే మిత్రుడిది), ఈ కోవకి చెందివనే నేను చెప్పిన ఆ మూడు పేర్లు, ఇంత కంటే డిటైల్డ్ గా చెప్పనక్కర లేదు అనుకుంటా, స్టైలిష్ స్టార్ స్టైలింగ్ లో మాత్రం ఇరగేసాడు, సినిమా మొత్తం తానై భుజాలపై మోశాడు, కంట్రోల్డ్ అండ్ మెట్యూర్ గా పెర్ఫార్మన్స్ చేశాడు, డాన్స్ విషయం లో నిరాశ పరిచిన మాట వాస్తవం, ఇంతకు ముందు ఆ రేంజ్ డాన్స్ లు చూపెట్టి ఈ సాంగ్స్ కి ఈ రేంజ్ లో చెయ్యటం ఖచ్చితం గా నిరాశే మరి. ఇంటర్వెల్ ముందు ఫైట్ లో తన నటన బాగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఎలా చెప్తే అలా తన వంతు గా 100% న్యాయం చేశాడు బన్నీ. ముందు ముందు మంచి సబ్జక్ట్స్ తో అలరిస్తాడు అని ఆశిద్దాం. 

సంగీతం మాస్టారు: మాములుగా గా అయితే ఇతరులు లో కలిపెయ్యోచు కానీ చెప్పాల్సింది ఏంటి అంటే, జనరల్ గా రాఘవేంద్ర రావు గారి సినిమాల్లో ఈయన బాగా చనువు తీసుకొని అతి గా చేస్తూ ఉంటారు, అలాంటిది ఈ సినిమా లో కూడా ఆ సినిమాలకి ఏ మాత్రం తీసిపోని అతి చేశారు, కామెడీ కోసం ఉద్దేశించిన పాత్రలు కూడా సందర్భం ని బట్టి రియాక్ట్ అవుతాయి, కానీ ఇంత పెద్ద సీనియర్ నటుడు అయి ఉండి కూడా ఇలా నటించటం శోచనీయం, శాస్త్రీయ సంగీతం మాస్టారు గా ఇరిటేట్ చేశారు 

ఇతరులు: ఉన్నంత లో మంచి డైలాగ్స్ పడ్డ రావు రమేష్ అలరించగా, మెయిన్ అపోజిషన్ షావర్ అలీ, సుబ్బ రాజు లు ఇంపాక్ట్ కలిగించ లేక పోయారు, మిగతా అందరూ ఉన్నా కూడా గుర్తుండి పోయే లా లేరు. 

సాంకేతిక వర్గం: 

సంగీతం: పాటలు వచ్చిన వెంటనే కాక పోయినా సినిమా వచ్చే టైం కి బాగానే ఎక్కేసాయి జనాలకి, ఆ పాటలు, ఆ కాన్సెప్ట్ లు ఆడియో లో విని ఏదో ఊహించుకుంటే సంబంధం లేని కాన్సెప్ట్ తో ఆన్ స్క్రీన్ డిసప్పాయింట్ చేశారు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అటు తిప్పి ఇటు తిప్పి వివిధ వేరియేషన్స్ లో వయోలిన్ బిట్ ని విచ్చలవిడి గా వాడేసిన దేవి క్లైమాక్స్ ని కూడా నాశనం చేశాడు, ఎమోషనల్ సీన్స్ లో ఎలివేట్ చెయ్యాల్సింది పోయి నవ్వించాడు, తన బెస్ట్ వర్క్స్ తో పోలిస్తే ఈ BGM ని లిస్టు లో చేర్చే పని లేకుండా చేశాడు. 

ఫైట్స్: బిల్లా 2, విశ్వరూపం, Mr. నోకియా సినిమాలకి ఫైట్ లు కంపోస్ చేసిన కెచా ఈ సినిమాకి కూడా బాగా కంపోస్ చేశాడు, హీరో ఎంట్రన్స్ లో చేజ్, ఇంటర్వెల్ ముందు ఫైట్, అమలా పాల్ ని కిడ్నాప్ చేసే ప్రయత్నం లో వచ్చే ఫైట్ బాగా వచ్చాయి, సినిమా కి పాజిటివ్స్ అని చెప్పుకునే లిస్టు లో ఖచ్చితం గా ఫైట్ కూడా ఉంటాయి. 

ఎడిటింగ్: చాలా చోట్ల కంటిన్యుటి మిస్ అయినా కూడా, తనకి ఇచ్చిన రీల్స్ ని బాగా కట్ చేశారనే చెప్పుకోవాలి, ఇంకొంచెం చనువు తీసుకొని అనవసరం అయిన సీన్స్ కూడా ముందే లేపేసి ఉంటె బావుండేది. 

సినిమాటోగ్రఫీ: సూపర్, సినిమా మొత్తం చాల రిచ్ గా ఉంటుంది, ఈ డిపార్టుమెంటు కుమ్మేసింది. 

మాటలు: జనరల్ గా పూరి సినిమాలు ఎలా ఉన్నా, డైలాగ్ లు మాత్రం అలరించేవి, ఈ మద్య అది కూడా తగ్గింది, ఈ సినిమా లో కూడా బాగా ఇంప్రెస్స్ చేసే రేంజ్ డైలాగ్ లు లేవు, గత మూడు చిత్రాలుగా తత్వం బోధిస్తున్న మన పూరి గారు ఈ సినిమాలో కూడా తుప్పల తత్వం, మానం మర్యాద తత్వం , బిసిబిల్లా బాత్ తత్వం అంటూ అయన రేంజ్ లో చెప్పేశారు, వన్ సైడ్ లవ్ గురుంచి, సినిమా వాళ్ళ వలన చెడ్డ పేరు వచ్చిన కులం గురుంచి అయన చెప్పిన విధానం ఒకప్పుడు డైలాగ్ లు ఇరగదీసిన పూరి ఏ నా అనే అనుమానం కలిగించే అంతలా ఆకట్టుకుంటాయి. ఇప్పట్లో వెనక్కి వచ్చేలా లేరు మనమే ఏదో ఒకటి అనుకొని సర్దుకు పోవాలేమో, ఒంటరి తనం ఫీల్ అయినప్పుడు ఒంటరిగానే ఉండాలి అని చెప్పిన పూరి గారు ఒంటరి గా ఉన్నప్పుడే మనం ఏంటో బయటికి వస్తుంది అన్నారు, మీరు ఒకవేళ ఇలాంటివి అన్ని ఒంటరిగా ఉన్నప్పుడు రాస్తున్నారేమో, దయ చేసి ఒక కంపెనీ వెతుక్కోండి సర్, ఏదైతేనేం అసలు ఒంటరి గా ఉన్నప్పుడు మీరేంటో తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగించారు. 

కథ, కథనం, దర్శకత్వం: కథ చెప్పేస్తే ప్రేక్షకులకి విసుగు పుడుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చిన పూరి గురుంచి ఇంక ఏం చెప్పాలి? అవతార్ సినిమా కూడా మొదట్లో బాలేదు అన్నారు జనాలు అని కంపేర్ చేసిన పూరి గురుంచి ఎం రాయాలి? ప్రతి అరగంట కి కొత్తగా ఎం చూశామా అని ఆశిస్తున్న ప్రేక్షకులకి ప్రతి పావు గంట కి కొత్తదనం అందించాను అని అనుకుంటున్న పూరి గారి రుణం ఎలా తీర్చుకోవాలి? అయన పర్సనల్ ఫీలింగ్స్ ని పక్కన పెట్టి అయన సినిమా పై మన పర్సనల్ ఫీలింగ్స్ డిస్కస్ చేసుకుందాం. గజిని తరహ లో సాగే కథ కి శివమణి లాంటి ట్విస్ట్ అన్నమాట, ముందు గా చెప్పుకున్నట్టు కథ ని లాస్ట్ 15 మినిట్స్ వరకు ఎక్కడా చెప్పకుండా ఆ టైం లో ఏదో కొత్త సినిమా చూస్తున్నట్టు గా రివీల్ చేశారు. జనరల్ గా పూరి సినిమాలు ప్రత్యేకం అయిన ఫార్మటు అంటూ ఎం ఉండవ్, తోచినట్టు గా వెళ్ళిపోతూ ఉంటాయి, అన్ని వర్కౌట్ అయితే హిట్ అంతే. ఎలాగు కథ మొత్తం లాస్ట్ లో ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి అప్పటి వరకు ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు మిగతా సినిమా అంతా ఉండేలా చూసుకున్నాడు. టైటిల్ కి తగ్గట్టు హీరో పాత్ర సినిమా మొత్తం పాసివ్ గా ఉండిపోతుంది, అయితే ఒక అమ్మాయి చుట్టూ లేదా రెండో అమ్మాయి పాయింట్ అఫ్ వ్యూ లో నే కథనం మొత్తం ఉంటుంది, హమ్మయ్య హీరో కి ఒక ఆశయం ఉంది, ఒక పగ ఉంది అని తెలిసిన టైం కి, ఇది తన పర్సనల్ పగ మాత్రమే కాదు దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళని మట్టుబెడ్డటం అని కూడా తెలిశాక నిరాశ తప్ప ఏమి మిగలదు. అసలు క్లైమాక్స్ కి ముందు అయితే మాత్రం మీరు ఇప్పటి వరకు చూసింది సినిమా నే కాదు అన్నట్టు ఏవేవో జరుగుతూ ఉంటాయి మన కళ్ళ ముందు, వాటి గురుంచి ఆలోచిస్తే ఇక్కడ రాసుకోటానికి ప్లేస్ సరిపోదు, ఇంకా  ఇంటర్వెల్ ముందు ఉన్న ముఖ్యమైన సీన్ లో కూడా ఎమోషన్ ని క్యారీ చెయ్యటం మానేసి హీరోఇసం మీద శ్రద్ద పెట్టారు, పొడిస్తే పడిపోయి ఉన్న ప్రేయసి ని ఎదురుగా పెట్టుకొని, చుట్టూ ఎంత మంది ఉన్నారు అని లెక్క కట్టి సైగ చేసి ఫైట్ చేసి చేసి చేసి చివరగా పోడిచినోడిని కనీసం వాడు ప్రేయసి ని పోదిచినంత సేపు కూడా కొట్టకుండా తేల్చేస్తే ఫీల్ ఎలా వస్తుంది? చిన్న లైన్ లాంటి కథకి ఆకట్టుకొనే కథనం ఆడ్ చేసి హిట్స్ కొట్టిన పూరి ఈ సారి కూడా చిన్న లైన్ నే ఎంచుకున్నాడు, కథనం ఏమైనా ఆశక్తి గా తీశాడా అంటే, క్యారెక్టర్ రాసుకోవటం నుంచి లొసుగులు కనిపిస్తాయి, డాక్టర్ తండ్రి, MBA తల్లి ఉన్న ఫ్యామిలి నుంచి వచ్చిన హీరో రోడ్ ల మీద బ్యాండ్ ఏసుకొని ఎం చేస్తున్నాడు, పోనీ అది పాకెట్ మనీ కి అనుకుంటే అసలు ఎం చేస్తూ ఉంటాడు అనేది ప్రశ్న, వయోలిన్ నేర్చుకోటానికి ఒక సాధారణ ఫ్యామిలీ అమ్మాయి యూరోప్ వెళ్ళటం, సైకాలజీ లో మాస్టర్ కి వెళ్ళిన అమ్మాయి ఒక్క సారి కూడా కాలేజీ కి వెళ్ళకుండా డైరీ పట్టుకు రోడ్స్ పై తిరగటం, ఇలా మెయిన్ కాస్ట్ ని సెట్ చేశారు. హీరో కి హీరోయిన్ నచ్చింది, హీరోయిన్ కూడా హీరో నచ్చాలి అనే రీతిలో లవ్ స్టొరీ ఉందే తప్ప ఫీల్ ఏది? రోజు డైరీ రాసుకునే అమ్మాయి కి వీడియో కెమెరా లో తీసింది ఎప్పటికప్పుడు చూసుకోటం లేక బ్యాక్ అప్ తీసుకొనే అలవాటు లేక పోవటం ఏంటి? పబ్లిక్ గా మర్డర్స్ చేసేస్తుంటే మచ్చుకి అయినా పోలీస్ లు మాట్లాడరు,అన్నింటికీ మించి చెయ్యి తగలేడితే కోమా లో ఉన్నోడు తెరుకోటం ఏంటి? ఇవి కాదన్నట్టు  అసలు సినిమా లో కంటిన్యుటి ప్రొబ్లెమ్స్ చాలా ఉన్నాయి , ఇంటర్వెల్ ముందు వరకు రోడ్ మీద కథ చెప్పిన హీరో ఇంటర్వెల్ అవ్వగానే పబ్ లో దర్శనం ఇస్తాడు? ఇంటెన్స్ సీన్ లో కట్ చేసి ప్రెసెంట్ కి తెచ్చేస్తారు ఆ తర్వాత ఏమైందో తెలియదు మనకి జస్ట్ అలా అయిపొయింది అంతే అనుకోవాలి ఏమో?  ఎవరైనా గమనించారో లేదో కానీ లాస్ట్ ఫైట్ కి ముందు వచ్చే సీన్స్ నుంచి అమలా వి అన్ని క్లోజ్ అప్ షాట్స్ ఏ ఉంటాయి, ఫైట్ అవుతున్న టైం కి పక్కనే ఉంటూ చెట్టు చాటునుంచి సీన్స్ ఉంటాయి, ఇద్దరు హీరోయిన్ లు లాస్ట్ ఫైట్ టైం లో సెపరేట్ గా తీసినట్టు ఉంటాయి సీన్స్. కొన్ని కలిపి తీసినా లాంగ్ షాట్ లో విల్లన్ తలపాగా కట్టుకునట్టు చూపిస్తారు (పాపం రీసెంట్ గా హెయిర్ కట్ చేసుకున్నాడో ఏమో) రీ షూట్ జరగలేదు అని చెప్పింది మనం నమ్మేయ్యోచు ఇవన్ని గమనిస్తే :) ఇలా రాసుకుంటూ పోతే బోలెడు ఉన్నాయ్ సుమీ. పూరి కి డేట్స్ ఇస్తున్న హీరోస్ నమ్మకం తో ఆడుకుంటూ ఇలాంటి సినిమాలు మన మీదకి వదిలే బదులు కొంచెం శ్రద్ధ గా తీస్తే బావుంటుంది అని ఆశించటం తప్ప ఏమి చెయ్యలేము 

ఎం చేసి ఉండాల్సింది: ఇంకాస్త ఇంటరెస్టింగ్ గా ఉండే కామెడీ థ్రెడ్ రాసుకొని ఉండాల్సింది, అవసరం లేని శంకరాభరణం లాంటి సాంగ్స్ బదులు టీసింగ్ సాంగ్ ప్రిఫర్ చేసి ఉండాల్సింది, తుప్పల్లో క్లాసులు బదులు లవ్ డెవలప్మెంట్ సీన్స్ రాసుకొని ఉండాల్సింది, అన్ని కోల్పోయి ఉన్న హీరో , అందని దూరం లో ఉన్న విల్లన్, తనకి నష్టం కలిగించటానికి పర్పస్ ఏంటో కూడా తెలియని హీరో, శొదించి , ఈ శోధన లో డబ్బులు విషయం తెలుసుకొని, ఎత్తులు వేసి, ముప్పతిప్పలు పెట్టి ఇంటరెస్టింగ్ మైండ్ గేమ్స్ తో విల్లన్ ని మట్టుబెడితే అదొక మజా. రెండో హీరోయిన్ లవ్ తో (ఈ సినిమా లో చూపించింది అయితే పూరి బాష లో మోజు తో) కాకుండా డైరీ ఆధారం గా తెలుసుకున్న విషయం తో పాటు తను ప్రేమించే తండ్రి నిజ జీవితం తెలుసుకొని హీరో కి హెల్ప్ చేస్తే ఆ పాత్ర కి ఒక అర్ధం ఉంటుంది. ఇది రెగ్యులర్ ఫార్మాట్ ఏ అయినా కొత్తగా తీశాం అనుకుంటూ ఇలాంటి అవుట్ పుట్ ఇచ్చేకంటే రెగ్యులర్ ఫార్మటు ని నమ్ముకుంటే సరిపోయేది గా అని 

చివరిగాఇద్దరమ్మాయీలతో  వెళ్ళినా లేక నలుగురు అబ్బాయిలతో అయినా చూడొచ్చు, అక్కడక్కడ మరిపించే సన్నివేశాలు ఉన్నా మిగతా టైం లో స్క్రీన్ పై సోది కంటే మనం సోది వేసుకోటానికి అయినా కంపెనీ ఉంటుంది. మంచి సినిమాటోగ్రఫీ, మంచి ఫైట్లు, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, బన్నీ ఇవి చాలు మాకు చూసేయ్యటానికి అంటే మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు, సెలెక్టివ్ గా చూసే వాళ్ళు, బీబత్సం గా ఆడేస్తుంది కాబట్టి తోపు సినిమా అనుకున్న వాళ్ళు తొందరపడి చూసే అంత లేదు, తాపీ గా DVD వచ్చినప్పుడో, పండగ కి టీవీ లో వేసినప్పుడో చూసుకోవచ్చు. 

You are receiving this email because you subscribed to this feed at blogtrottr.com.

If you no longer wish to receive these emails, you can unsubscribe from this feed, or manage all your subscriptions

0 comments:

Blog Archive