Tuesday, 23 April 2013

HARI THE HERO: Ee Rojullo.. Aa Rojullo (Oke Cine Premikudi Gnapakalu)

HARI THE HERO
Oka Cinema Pichodu
thumbnail Ee Rojullo.. Aa Rojullo (Oke Cine Premikudi Gnapakalu)
Apr 23rd 2013, 05:25



ట్విట్టర్ .. పేస్ బుక్ లు  మద్య కాలం లో మనకి పార్ట్ అఫ్ దిన చర్య గా మరిపొయయిజనరల్ చాటింగ్ నుంచి సినిమా విశేషాలు తో సహా న్యూస్ వరకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆన్ నెట్ ఆప్షన్ లో దొరుకుతుందిమనకి మిగతా టాపిక్స్ కంటే సినిమా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురుంచి మాట్లాడుకుందాంపైన చెప్పిన వాటికీ తోడు మనకి ఇప్పుడు ఉన్న సినిమా సైట్స్ బ్లాగ్స్ అసలు ఇన్ఫర్మేషన్ కి కొదవు లేకుండా చేస్తూ ఉన్నై.   ఒకప్పటి ఫాన్స్ ... ఇప్పుడు ఉన్నారుఒకప్పటి సినిమా పిచోళ్ళు .... ఇప్పుడు ఉన్నారు కాని అప్పటికి ఇప్పటికి బోలెడు డెవలప్మెంట్స్ , మంచి చెడు పక్కన పెట్టి థ్రిల్ గురుంచి చెప్పాల్సి వస్తే అబ్బోవ్ చాలా  మిస్ అయిపోతున్న ఫీలింగ్ నా వరకు. ... టూకీగా డిస్కస్  చేద్దామనే  పొస్ట్



అసలు ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అనే విషయం ఫస్ట్ ఫాన్స్ ఆఫీసు నుంచి వచ్చేదిఅప్పటికి బాగా పాపులర్ అయిన  సూపర్ హిట్ కాపీ కోసం ఎగబడే వాళ్ళంఫస్ట్ పేజి లో పెద్ద ఫోటో  అండ్ మిడిల్ పేజి నిండా బోలెడు విశేషాలు.. అక్కడ నుంచి ట్రాక్ చేసుకోటమేఒక వేళ  ఏదైనా షూటింగ్ మనకి దగ్గరలో ఉన్నా కూడా ఫాన్స్ ఆఫీసు నుంచి న్యూస్ అండ్ డబ్బులు ఉన్నోళ్ళు బండి కట్టించుకొని వెళ్లి చూసి ఫోటో దిగి రవొచ్చు. .. ఇప్పుడు అయితే ముహూర్తం ఇంకా అవ్వక ముందే ఫోటో లువీడియోస్ .. లైవ్ అప్డేట్స్... 24 / 7 న్యూస్ చానల్స్ లో కూడా ఓపెనింగ్ విశేషాలే ... 

అప్పట్లో ఫాన్స్ హీరోస్ కి లెటర్స్ రాసే వాళ్ళు, అసలు ఆ లెటర్స్ లో ఫీల్ ఏదైతే ఉందొ అబ్బోవ్ త్రివిక్రమ్ గారు ఎందుకు పనికి రారు అనేలా, దానికి హీరో ఆఫీసు నుంచి రిప్లై వచ్చేది, ఒక సంతకం పెట్టిన ఫోటో అఫ్ లేటెస్ట్ సినిమా, ఆ ఫోటో ని ఎంతో అపురూపం గా దాచుకునే వాళ్ళం. 

సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లు అంటే సందడే సందడి . 24 షీట్ పోస్టర్ అంటిస్తుంటే లాస్ట్ షీట్ అయ్యే వరకు ఓపిగ్గా నిలబడి చూసే వాళ్ళం రోడ్ పై..  ప్లేస్ లో అంటిస్తున్నాడు అనే దానిని బట్టి  థియేటర్ లో రిలీజ్ అని డిసైడ్ అయిపోయే వాళ్ళం . పోస్టర్ మొత్తం పడ్డాక నిమ్మ కాయిల  దండ పడాల్సిందేఇంకో వారం రోజులు అదే టాక్రోజు  రూట్ లో వెళ్తూ పోస్టర్ చూడటం , పని ఉన్న లేక పోఇన  రూట్ లో వెళ్లి ఐన పోస్టర్ చూసి రావటం . (చిన్న ఉదాహరణవైజాగ్ లో  సీతయ్య సినిమా పోస్టర్ గురుద్వార్ జంక్షన్ లో పడింది అంట కేక అంటే గోపాల పట్నం నుంచి ఓన్లీ పోస్టర్ చూడటానికి బస్సు లో వెళ్లి చూసి వచ్చాంవాల్ పోస్టర్ ని అపురూపం గా చూసుకోటంవేరే హీరో సినిమా కి మా పోస్టర్ మార్చకుండా చూసుకోటం  సినిమా ఆడుతున్న అన్ని రోజులు వారం వారం పడే కొత్త పోస్టర్ కోసం ఎదురు చూడటం .... ఇప్పుడు అయితే ఫస్ట్ లుక్ వచ్చిన రోజు నైట్  టాపిక్ ఓవర్ అనే రేంజ్ లో మర్చిపోతాంమహా అయితే 2 డేస్ డిస్కషన్.. వాల్ పోస్టర్స్ మర్చిపొయి వాల్ పేపర్స్ గురుంచి మాట్లాడుకుంటున్నాం . 

ఇంక ఆడియో విషయానికి వస్తేపొద్దున్నే రైల్వే స్టేషన్ లో పడిగాపులువిజయనగరం లో ఉండే అప్పుడు అయితే వైజాగ్ వచ్చిన తర్వాత మాకు వచ్చేవి లేదంటే డైరెక్ట్ గా ట్రైన్ లో వచ్చెవిస్టేషన్ నుంచి డైరెక్ట్ గా హోల్ సేల్ ఆఫీసు కి పార్సిల్ తో పాటు వెళ్ళిపోయికేసెట్ తో పాటు వచ్చిన పోస్టర్ కొనుక్కొని ఫస్ట్ కేసెట్ ఫుల్ సౌండ్ లో అక్కడే వినేసిబావుంటే ఒక ఆనందం బాగోక పొఇన వినగా వినగా నచ్చుతాయి  లే అని ఒక పాజిటివ్ ఫీల్ తో ఇంటికి వెళ్లి కాసేట్ అరగ్గోట్టడం. అప్పట్లో టేప్ రికార్డర్ ఉన్నోడు  తోపు, వాడిని బతిమాలుకొని వాడి ఇంట్లో వినటమో లేదంటే  ఈవెనింగ్  టీ షాప్ దగ్గరొ.. ఆడియో షాప్ దగ్గరో పాటలు వింటూ జనాల  ఒపీనియన్ కనుక్కోటంసేల్స్ ఎలా అవుతున్నాయోరికార్డింగ్ లు ఎక్కువ అవుతున్నాయో లెదొఅబ్బోవ్ సినిమా వచ్చే వరకు బోలెడు టైం పాస్ఫాన్స్ మద్య గొడవలు లేకుండా ఒక్కో బ్యాచ్ కి వాళ్ళ ఆస్థాన ఆడియో షాప్స్ ఉంటాయి .. అక్కడ కి వెళ్తే చాలు అప్పుడే టైం అయిపాయిందా అనిపించెది.............  ఇప్పుడు FM లో YOUTUBE లో బిట్ సొంగ్స్.. ఆడియో ఫంక్షన్ కి ముందే ఫుల్ సాంగ్స్ .. ఆడియో షాప్ మొహం చూసి యుగాలు అవుతుంది . 

ట్రైలర్ విషయానికి వస్తే ఏదైనా సినిమా ధియేటర్ లో ఇంటర్వెల్ లో వేస్తేనే ట్రైలర్ ... ట్రైలర్ ఇంకో సరి చూడాలి అంటే మళ్ళి సినిమా కి వెళ్లి ఇంటర్వెల్ అయ్యాక రావటమే ... .. 

సినిమా రిలీజ్ టైం కి... ముందు రోజు నిద్ర లు ఉండేవి కాదు.. అసలు వారం రోజుల ముందు నుంచి హడావుడి బ్యానర్ లు ఎన్ని కట్టాలి .. ఇప్పటి లా డిజిటల్ ప్రింటింగ్ కాదు గా  .. క్లాత్ మీద పెయింటింగ్ ... హీరో పేస్ ఎక్కడ తేడా వచ్చిన జనాలు నవ్వుతారు కాబట్టి వాడికి ఇవ్వాల్సిన డబ్బులతో పాటు  టైం కూడా ఇచ్చిఎప్పటికి అప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ అదొక మహా యజ్ఞం లా గడిచేది, విజయనగరం లో అయితే సినిమా రిలీజ్ అయ్యే ముందు ధియేటర్ దగ్గర హీరో పైటింగ్ వేయించేవారు, అదొక రెండు రోజుల ప్రాసెస్, ఐన కూడా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు దగ్గరుండి చూసుకొటమే ... ఇప్పుడు  డిజిటల్ ప్రింటింగ్ లు ఫోటోషాప్ లు వచ్చేసాయి గా హ్యాపీ గా ... ఫస్ట్ షో ఎక్కడ పడినా మన ఏరియా లో పడేదే మా వరకు లెక్కఎక్కడో ఎవరో చూశారు .. టాక్ చెప్పారు ... ఇట్టాంటివి దొబ్బవ్ .. ముందు మేము చూసి చెప్పేదే టాక్ ... మహా అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండేది సినిమా గురుంచి .. అప్పుడు కూడా  ముందు రోజు నైట్ ప్రీమియర్ షో లు ... తెల్లవారు జాము షో లు ఉండేవి .. కానీ ఇప్పటి లా లైవ్ లో సీన్ టు  సీన్ బయటికి వచ్చేది కాదుఎవడు చెప్పినా కూడా వినే వారు కాదు నమ్మే వాళ్ళు కాదుఇప్పుడు సినిమా చూడని వాడు కూడా మార్నింగ్ షో కి ముందే సీన్ టు  సీన్ చెప్పేస్తాడు . 

అన్నింటికీ మించి ఇంత పెద్ద రిలీజ్ లు అప్పుడు ఎక్కడ ఉన్నాయ్, (ఉదాహరణ కికంచరపాలెం లో రిలీజ్ ఉంటె గోపాలపట్నం లో కూడా ఉండేది పొరపాటున మద్య లో 104 లో పడితే రెండు ఉండేవి కాదుఅటు ఇటు జనాలు 104 కి పరిగేతాల్సి వచ్చెదిఅక్కడ బ్లాకు కూడా ఉండేది కాదులెక్క పెట్టి లైన్ ఆపేస్తాడు తర్వాత లైన్ లో ఉన్న టికెట్స్ దొరకవ్  అని ధియేటర్ స్టాఫ్  లెక్క పెట్టి పంపేస్తారు . అక్కడ రిలీజ్ అంటే ముందు రోజు రాత్రి వెళ్ళిపోయి లైన్ దగ్గర పడుకునే వాళ్ళు కూడా ఉండేవారు . అలాంటి టైం లో మేము పెందుర్తి లేక కొత్తవలస ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేదిఅక్కడ అయితే టికెట్ కి లిమిట్ ఉండదుఎంత మంది వచ్చిన టికెట్ ఇచి లోపలకి  పంపిస్తాడు ఎక్కడో ఒక దగ్గర నిల్చొని చూసే వాళ్ళంఅక్కడికి వెళ్ళాలి అంటే ట్రావెల్  30 నిముషాలు పైన.) అప్పట్లో రిక్షావోడు  సినిమా కంచరపాలెం, 104 అండ్ గోపాలపట్నం రిలీజ్ ఇస్తే అది అతి పెద్ద రిలీజ్అలాంటిది ఇప్పుడు గోపాలపట్నం లో 6 థియేటర్స్ ఉంటె 5 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్దిఅప్పట్లో సింగల్ ధియేటర్ మీద టికెట్స్ కి పడే పాట్లు , మార్నింగ్ షో కి టికెట్ దొరికితే ఏదో సాదించిన వాడి లా గర్వంటికెట్స్ దొరక్క గేటు బయట ఉండే వాళ్ళనిఇంటర్వెల్ టైం లో టాక్ అడిగే వాళ్ళని చూస్తే మనమే ఒక సినిమా హీరో అనే ఫీలింగ్అన్నిటికి మించి ఫాన్స్ అందరు ఒకే ధియేటర్ లో ఉండటం వలన హంగామా  రేంజ్ లో ఉండేది అని అర్ధం చేసుకోండి ఎక్కువ థియేటర్స్ వలన ఫాన్స్ కూడా సగం ఇక్కడ సగం అక్కడ ఎలాగోలా చూసేయ్యాలి అని డివైడ్ అయిపోవటం వలన మనం ఇప్పుడు చూస్తున్న హంగామా అనేది సగమే అని కూడా గమనించ గలరు.

మారుతున్న కాలం తో పాటు మనము మారాలి.. ఒకప్పటి కంటే ఇప్పుడు పైన చెప్పుకున్న చాలా  విషయాల వలన సినిమాలకి పబ్లిసిటీ పెరిగింది జనాలకి ఇన్ఫర్మేషన్ ఫ్లో మారింది.. అందరికి అన్ని ఒకే సారి తెలిసిపోతున్నాయి.. ఇన్ అండ్ అవుట్ ఓపెన్ బుక్ టైపు లో ఉంది...సినిమా స్టార్ట్ ఐన దగ్గర నుంచి  ఎక్కడ ఎప్పుడు ఎం జరుగుతుందో  తో పాటు   ధియేటర్ లో ఎంత ఆడింది ఎంత రాబట్టుకుంది వరకు అన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాయి .. అప్పటికి ఇప్పటికి తేడా ఎంత ఉన్నా ... మొత్తం విప్పేస్తే ఏముంటుందికనిపించి కనిపించకుండా ఉంటే  మజా నే వేరు అని ఫీల్ అయ్యే నా లాంటి వాళ్ళు మాత్రం ఇంకా మిస్ అవుతూనే ఉన్నారు ... "ఎవడు మిస్ అవ్వమన్నాడు .. అసలు ఎవడు చూడమన్నాడు నిను న్యూస్ .. పోస్టర్స్ .. వాల్ పేపర్స్ .. లైవ్ అప్ డేట్స్ . వెళ్లి గోడ మీద పోస్టర్ లు చూసుకో.. నిమ్మ కాయలు కట్టుకో ... ఆడియో కాసేట్ అరగోట్టుకో .. దొబ్బెయ్ ఇక్కడ నుంచి అని ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా ? " కనిపించి కనిపించకుండా ఉంటె మజా  అన్నాను కానీ విప్పేస్తే చూడను అనలేదు గా ... :) 

ఇట్లు 
మీ 
హరి కృష్ణ రాజు 

You are receiving this email because you subscribed to this feed at blogtrottr.com.

If you no longer wish to receive these emails, you can unsubscribe from this feed, or manage all your subscriptions

0 comments:

Blog Archive