Monday, 17 December 2012

HARI THE HERO: Important Announcement :)

HARI THE HERO
Oka Cinema Pichodu
Important Announcement :)
Dec 17th 2012, 10:53


బ్లాగింగ్ మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అయింది, మొత్తం మీద 6000 పోస్ట్ లు 2,000,000 (ఇరవై లక్షలు) పేజి హిట్స్ ని ఈ రోజుకి రీచ్ ఐంది. మొదట్లో మాములుగా స్టార్ట్ అయి ఒకానొక టైం లో పీక్స్ కి వెళ్లి , ఆ తర్వాత పెళ్లి అయ్యాక కొంచెం తగ్గి, పిల్లాడు పుట్టాక ఇంకా తగ్గి, ఇప్పుడు ఏదో అలా రన్ అవుతుంది , ఇప్పటికి అప్ డేట్స్ కోసం చాలా టైం స్పెండ్ చెయ్యాల్సి వస్తుంది. నేను బ్లాగ్ స్టార్ట్ చేసిన రోజుల్లో చాలా తక్కువ బ్లాగ్స్ ఉండేవి, అలాంటిది ఇప్పుడు బ్లాగ్స్ అండ్ సైట్స్ కోకొల్లలు. అందువలన ఫిలింన్యూస్ కోసమో, వాల్ పేపర్స్ కోసమో, థియేటర్స్ లిస్టు కోసమో అంత టైం స్పెండ్ చేసి బ్లాగ్ ని ఇంకా అప్డేట్ చెయ్యలా అనే ప్రశ్న మైండ్ లో మెదులుతూనే ఉంది. అందుకే ఈ announcement. 

ఇంత కాలం రెగ్యులర్ గా బ్లాగ్ ని ఫాలో అవుతూ, ఎప్పటికప్పుడు నాకు కొత్త ఎనర్జీ ని ఇచ్చి, ఈ రోజు ఇంత దూరం నా బ్లాగ్ ప్రయాణం లో నాతో  కలిసి ట్రావెల్ చేసిన వీక్షక మహాశయులకి  పేరు పేరు న కృతజ్ఞతలు. అన్నమయ్య క్లైమాక్స్ టైపు లో " అంతర్యామి అలసితి సొలసితి .... ఇంతట నీ శరణిదే చొచ్చితిని" అని గట్టిగా అరిచి పాడాలని ఉంది. ఇంతటి సినిమా పిచ్చని ఇచ్చి "పైపైనే  సంసార భందముల కట్టేవు ....... నా పలుకు చెల్లున నారాయణ" అని అడగాలని ఉంది. ఏది ఏమైనా ఈ సమయం ఇంత త్వరగా వస్తుంది అని నేను కూడా అనుకోలేదు.  "కొమ్మలు రెమ్మలు గొంతు విప్పిన కొత్త పూల మధుమాసం లో, తుమ్మెద జన్మకి నూరేళ్ళు ఎందుకు రోజే చాలులే..... ఒక పుటలోనే రాలు పువ్వులెన్నో" అనేది నగ్న సత్యం.  "పరుగును తీస్తూ అలసిన ఓ నది నేను..... ఇరు తీరాల్లో దేనికి సొంతం కాను" అని ఎటు తేల్చుకోలేని టైం లో ఈ హిట్స్ కోసమే నా ఇన్నాళ్ళు అంత టైం స్పెండ్ చేసింది అని అనుకునప్పుడు  "అమృతమే చెల్లించి ఆ విలువతో.. హాలాహలం కొన్నాను అతి తెలివితో. కురిసే ఈ హిట్స్ జడిలో తడిసి నిరుపేదనయ్య"   అని తెలుసుకోవటమే కాకుండా తెలుసుకున్న ఇంకో విషయం మన మధుమాసం అయిపోఇంది ఇంకా షెడ్ కి వెళ్ళే టైం వచ్చింది. వెయిట్ వెయిట్ అసలేం రాస్తున్నాను ? ఈ పేరాగ్రాఫ్ నేను చదువుకుంటుంటే ఇంత దరిద్రం గా ఎలా రాయగలిగాను అబ్బా అనిపిస్తుంది, మీకు కూడా అలాగే అనిపిస్తే ఇంకొంచెం ఓపిక పట్టి కింద మిగిలిన లాస్ట్ పేరాగ్రాఫ్ చదివెయ్యండి, లేదు కొంపతీసి ఏమైనా ఫీల్ అయితే ఇంకో సారి  ఈ పేరాగ్రాఫ్ చదవండి ఖచ్చితం గా  మనసు మార్చుకుంటారు. 

ఓరినాయనో వినే వాడు వై  ఎస్ అయితే చంద్రబాబు చిరుత పాట పాడినట్టు,  చదువుతున్నాం  కదా అని ఏందీ వై నీ లొల్లి అంటారా? మేటర్ ఏంటంటే, బ్లాగ్ ని మైంటైన్ చెయ్యటానికి టైం సరిపోవటం లేదు కాబట్టి, ఇక నుంచి  అన్ని సెక్షన్స్  కాకుండా ఓన్లీ ఆడియో అండ్ మూవీ రివ్యూస్ + ఇంటరెస్టింగ్ ఆర్టికల్స్ ఏమైనా ఉంటె సినిమా అంటే పిచ్చి సెక్షన్ మాత్రమే అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్ గా ఉండే స్పామింగ్ నుంచి మీ అందరికి విముక్తి కలిగించబోతున్నా  అని సగర్వంగా తెలియజేస్తున్నా. అంటే ఇలాంటి అప్ డేట్స్ కోసం టైం స్పెండ్ చేసే కంటే ఫ్యామిలీ  తో స్పెండ్ చేయ్యోచ్చు లేదా టైం దొరికినప్పుడు రివ్యూస్ రాసుకోవచ్చు అని డిసైడ్ ఐపోయాను అన్నమాట.  ఎలాగు ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉంటాను కాబట్టి మనం అక్కడ రెగ్యులర్ గా టచ్ లో ఉందాం. తెలియని వాళ్ళకోసం నా ట్విట్టర్ ID :     https://twitter.com/harikraju

ఇట్లు మీ 
హరి కృష్ణ రాజు 

You are receiving this email because you subscribed to this feed at blogtrottr.com.

If you no longer wish to receive these emails, you can unsubscribe from this feed, or manage all your subscriptions

0 comments:

Blog Archive