Cinema..Cinema..Cinema - Cinema ante Pichi Oct 4th 2013, 10:06, by HKR
మనలో సినిమా పిచ్చ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, రిలీజ్ ఐన ప్రతి సినిమా ని చూస్తూ ఏదో ఒక రోజు నేను కూడా సినిమా కి కథలు రాయాలి అని కలలు కనే వాళ్ళు ఉన్నారు, సినిమా చూసోచ్చి వేరే వాళ్ళు రాసిన రివ్యూ లు చదివి అరేయ్ ఈ పాయింట్ నాకెందుకు తట్టలేదు, నిజమే కదా, ఇది మిస్ ఐంది కదా అని అనుకొనే వాళ్ళు ఉన్నారు, ఆశక్తి ఉండి ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎక్కడ మొదలు పెట్టాలో డిసైడ్ అవ్వలేని వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగ పడాలి అనే ఉద్దేశం తో నాకు తెలిసిన, నేను చదివిన, నేను విన్న సినిమా పరిజ్ఞానం గురుంచి టూకి గా రాద్దాం అనే ఆలోచనే నా ఈ "సినిమా, సినిమా, సినిమా" ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం.
కథలు రాయటానికి స్వతహాగా ఉండాల్సిన క్రియేటివిటీ ఎంత అవసరమో పరిశీలనా ధోరణి కూడా అంతే అవసరం. నవలలు వ్రాసే వారు ఆలోచనలని తెలియజేస్తూ కథ చెప్తారు, నాటక రచయిత సంభాషణల ద్వారా కథ నడిపిస్తారు, కానీ సినిమా కి వచ్చే సరికి పాత్రల చేతలను దృశ్య రూపం లో చూపిస్తూ కథ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బేసిక్ గా చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరగటం వలన, మన తెలుగు సినిమాలలో తరుచుగా ఉండేవి, ఉండాల్సినవి, ఇంత కాలం మనం చూస్తున్నవి, తెలుసుకున్నవి ముందుగా మాట్లాడుకుందాం.
సినిమా కథ కి ఉండాల్సిన ముఖ్య లక్షణం "ప్రేక్షకులు ఐడెంటిఫై చేసుకునే పాత్రలు, లేదా ప్రేక్షకుల సింపతీ ని పొందగలిగే పాత్ర తాలూకు కథ ఐ ఉండాలి" అప్పుడప్పుడు సూపర్ మాన్ లు, లార్జెర్ థెన్ లైఫ్ రోల్స్ కూడా వస్తు ఉంటై కానీ ఎక్కువ మనం ముందు చెప్పుకున్న కోవ కి సందందించిన కథలే చూస్తూ ఉంటాం. ఆ పాత్ర కి ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం ని చేరవలసిన దారి చాలా కష్టం ఐనది ఐ ఉండాలి, అందుకునే విధానం మలుపులతో చూస్తున్న వాళ్ళని కట్టి పడేసే లా ఉండాలి, అన్నిటికి మించి ముగింపు సుఖం గా ఉండాలి, అదే అంది హ్యాపీ ఎండింగ్ అన్నమాట. సినిమా కి కథ ఒక్కటే ఉంటె సరిపోదు కదా, దానికి పకడ్భంది గా అల్లిన కథనం (SCREENPLAY) ఉండాలి. మరి ఈ కథ కి కథనం కి ఉన్న తేడా ఏంటి? ఎం జరిగిందో చెప్పటం కథ అయితే, ఎలా జరిగిందో చెప్పటం కథనం. ముందు గా అనుకున్న కథ కి కథనం ని ఆడ్ చేసిన తర్వాత మాటలు కూడా కలిసి ఒక సినిమా స్క్రిప్ట్ రెడీ అవుతుంది. మన సినిమా వరకు, కథ కంటే కథనం చాల ముఖ్యం అనిపిస్తుంది
ఈ మద్య కాలం లో. ఏ కథ చెప్తున్నాం అనే కంటే ఎలా చెప్తున్నాం అనే దాని గురుంచే జనాలు మాట్లాడుకుంటారు. కథనం బాగా పండిన సినిమాలే సూపర్ హిట్ లు అవుతూ ఉంటై. ఉదాహరణకి: నరసింహ నాయుడు కథ ఉంది, దానిని ప్లైన్ గ బాల కృష్ణ చిన్నప్పటి నుంచి చెప్పుకోచేస్తే సినిమా రిసల్ట్ వేరే ల ఉండేది, నృత్యకారుడు గా పరిచయం చేసి, ఫ్లాష్ బ్యాక్ లో అసలు కథ చెప్పి పవర్ ఫుల్ క్లైమాక్స్ జోడించటం వలన ఈ రోజు ఆ సినిమా గురుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విధానం మనం అంత కు ముందు వచ్చిన బాష, సమరసింహా రెడ్డి ల లో చూసిన కూడా, నరసింహ నాయుడు లో ఎఫెక్టివ్ గా చూపించాబట్టి అది పెద్ద హిట్ ఐంది. ఏ సీన్ ఎక్కడ పడాలి, ఏ సీన్ లో ఎం చెప్పాలి అనే విషయం నేర్చుకోవాలి అంటే మన ముందు ఉన్న ఎన్నో తెలుగు సినిమాలని అధ్యనం చెయ్యాలి ముఖ్యంగా చాలా ఓపిక కావాలి. .
ఒక సినిమా బావుంది లేదా బాగాలేదు అని చెప్పటానికి ఒక్క నిమిషం చాలు, కానీ ఎందుకు బావుంది, ఎందుకు బాలేదు అని విశ్లేషించు కోటానికి చాలా టైం పడుతుంది, చెప్పాలంటే రివ్యూ లో రేటింగ్ చూసి లాస్ట్ లైన్ చదవటానికి, రివ్యూ మొత్తం చదివి ఈ రివ్యూ ద్వారా ఇతను ఎం చెప్పాలి అనుకుంటున్నాడు అని అర్ధం చేసుకోటానికి ఉన్నంత తేడా ఉంది. జనరల్ గా రివ్యూ అనేది ఒక వ్యక్తి తాలుకు ఒపీనియన్, ఒక సినిమా కి చాలా మంది చాలా రివ్యూస్ రాస్తూ ఉంటారు, ఎవరు ఎంత ముందు రాసిన మనం మనకి నచ్చిన సైట్ లేక వ్యక్తి టాక్ కోసం వెయిట్ చేసి అప్పుడు సినిమా గురుంచి డిసైడ్ చేస్తాం, కారణం, ఆ వ్యక్తి మన లాగే అలోచించి రాస్తున్నాడు అని మనం ఫీల్ ఐ కనెక్ట్ అవ్వటం. అలా ఎవరి ప్రేఫెరేన్సు వాళ్ళకి ఉంటుంది, కానీ అన్ని రివ్యూస్ ని పరిశీలిస్తే రివ్యూస్ లో ని కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని రివ్యూస్ లో ప్లస్ ఐనవి ఇంకొన్ని రివ్యూస్ లో మైనస్ అవుతాయి కానీ పాయింట్స్ మారవు. ఇంకా ప్లస్ అండ్ మైనస్ అనేది చూసే వ్యక్తి ని బట్టి అతని అంచనా విధానం ని బట్టి మారుతూ ఉంటై. నా వరకు అయితే సినిమా పిచ్చ ఉన్న వాళ్ళు బావున్న సినిమా ని చూస్తారు, బాలేని సినిమా ని ఎందుకు బాలేదంటావ్ అనే కుతూహలం తో చూస్తారు, చూడటం ఎలాను మాననప్పుడు చూసే ముందు రివ్యూస్ చదవటం మానెయ్యటం ఉత్తమం. ప్లైన్ మైండ్ తో థియేటర్ లో కి వెళ్లి సినిమా చూసి, బయటికి వచ్చే అప్పుడు ఒక నలుగురిని సినిమా ఎలా ఉందొ కనుక్కొని, ఆ తర్వాత మనకి ఎం అర్ధం అయిందో ఒక పేపర్ మీద రాసుకొని, అప్పుడు మనకి నచ్చిన లేక జనం మెచ్చిన క్రిటిక్ ఏమన్నాడు? ఎలా రాసాడు? నేను అతని లా చూడగలిగానా ? నేను రాసుకున్న దానికి అతను రాసిన దానికి తేడా ఏంటి? మిగతా క్రిటిక్స్ ఏమంటున్నారు? ఇలాంటివి బేరీజు వేసుకోవటం మనం ముందు గా మొదలు పెట్టాల్సిన విషయం. మన కథని మనం సినిమా కథ గా మార్చాలి అంటే ముందు సినిమా కథలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి, కథనం ని అర్ధం చేసుకోవాలి, మనం చూసే చూసే సినిమా ని అనలైజ్ చేసుకోవాలి, మన అంతట మనం సినిమా ని వాళ్ళలా అనలైజ్ చెయ్యగలం అంటావా ? ఒక వేళ ఇలాంటి డౌట్స్ ఉంటె, వాళ్ళు కూడా ఒకప్పుడు జీరో నుంచి స్టార్ట్ ఐన వాళ్ళే అని మర్చిపోవద్దు. ప్రపంచం లో ఫేమస్ స్క్రీన్ రైటర్ లు సినిమా స్క్రీన్ ప్లే గురుంచి చాలా పుస్తకాలు రాశారు, వాటిలో కొన్ని పాయింట్స్ గురుంచి తెలుసుకుందాం. అన్ని సినిమాలకి వర్తించక పొఇన చాలా వరకు ప్రతి సినిమా కి ఒక కామన్ స్ట్రక్చర్ ఉంటుంది, దానినే మూడు భాగాలుగా విభజిస్తారు సైడ్ ఫీల్డ్ "ACT 1 : SETUP" " ACT 2: CONFRONTATION " అండ్ " ACT 3: RESOLUTION" , సింపుల్ గా ప్రారంభం, మధ్యమం అండ్ ముగింపు. సాధారణం గా తెలుగు సినిమా నిడివి140 నిముషాలు, ఒక్కొకటి 10 నిముషాలు చెప్పున 14 రీళ్ళు, రఫ్ గా 60 నుంచి 80 సీన్ లు. మనకి ఇంటర్వెల్ కూడా ఉంటుంది కాబట్టి, సినిమా టైం ని పైన చెప్పుకున్న Act గా విభాజించుకుంటే, ప్రారంభం 35 నిముషాలు, మద్యయం 70 నిముషాలు (ఇందులో సగం టైం కి అంటే 35 నిమిషాలకి ఇంటర్వెల్) అండ్ ముగింపు 35 నిముషాలు. మనం ఎంచుకున్న కథని బట్టి కథనం ని బట్టి ఈ టైం లు అటు ఇటు గా మారుతూ ఉంటై. ఆ విధం గా ఫస్ట్ 30 నుంచి 40 నిమిషాల మద్య పాత్రలు, పరిచయాలు, సమస్యలు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత, ఏదో ఒక ఇంపార్టెంట్ సీన్ లేక సమస్య తో సెకండ్ ఆక్ట్ కి ఎంటర్ అవుతుంది, దీనిని ఎలా గుర్తించటం అంటే, అప్పటి వరకు ఉన్న ఫ్లో లో మార్పు ఉంటుంది, కొత్త లొకేషన్ / సీన్స్ కి కథ షిఫ్ట్ అవుతుంది. హీరోయిన్ తో ప్రేమాయణం, కామెడీ, పాటలు,వగైరా వగైరా అన్ని సజావుగా అవుతున్న టైం లో ట్విస్ట్ వచ్చి నెక్స్ట్ ఎం జరగబోతుంది అనే ఫీల్ అని కలిగించేలా సెకండ్ Act లో ని ఫస్ట్ Act ముగుస్తుంది, దానినే మనం ముచ్చటగా ఇంటర్వెల్ బాంగ్ అనుకుంటాం. ఇక సెకండ్ హాఫ్ మొదలు అయ్యాక ఎత్తులు పైఎత్తులు, పోరాటాలు, సరైన టైం లో హీరో కి కోలుకోలేని దెబ్బ, ఇంక అన్ని దారులు మూసుకు పోయాయి అనే టైం లో ఒక క్లూ పాయింట్ దొరకటం (ప్రీ క్లైమాక్స్) తో సినిమా 3 Act ఐన ముగింపు అదే క్లైమాక్స్ కి ఎంటర్ అవుతుంది అండ్ ఫైనల్ గా సుఖాంతం గా శుభం కార్డు పడుతుంది. ఇదే 3 Acts ని బ్లేక్ సైన్దర్ ఇంకా డిటైల్డ్ గా విభాజిస్తాడు (Act 1 : Opening Image, Theme Started, Set-up, Catalyst, Debate, Act 2: Break into 2, B- Story, Fun and Games, Mid point, Bad guys close in, All is Lost, Dark Night of the Soul, Act 3: Break into three, Finale, Final Image). ఉదాహరణకి: ఎన్టీఆర్ దమ్ము సినిమా విశేషించుకుందాం. మూల కథ గురుంచి చెప్పిన తర్వాత హీరో ఇంట్రడక్షన్, తన క్యారెక్టర్ పరిచయం, కోరికలు, పరిచయం చేసిన తర్వాత త్రిష ని పెళ్లి చేసుకోవాలి అంటే తనకి ఫ్యామిలి ఉండాలి కాబట్టి దానిని కీ పాయింట్ గా ఉపయోగించుకొని కోట గారికి దత్తత వెళ్ళటం తో ఫస్ట్ Act ముగించి, కథ ఊరికి షిఫ్ట్ అవుతుంది, సెకండ్ act మొదలు అవుతుంది, కరెక్ట్ గా పరిశీలిస్తే ఇది 35 వ నిమిషం లో జరుగుతుంది. అక్కడ నుంచి రెండో హీరోయిన్ B - ప్లాట్, , బ్రహ్మానందం కామెడీ, తో కాలక్షేపం చేస్తూనే, తాంబూలం సీన్ తో మల్లి మెయిన్ కథ ని టచ్ చేస్తారు, అప్పటి వరకు హీరో ఆ ఇంట్లో ఎందుకు ఉన్నాడు అని మనకి మాత్రమే తెలుసు కానీ హీరో కి తెలియదు, సో తెలిస్తే ఉంటాడ పోతాడ ఎం చేస్తాడు, ఎలా చేస్తాడు అనే డౌట్స్ మద్య హీరో గుఱ్ఱం బండి పై వెళ్లి తోడ కొడతాడు, ఇది ఇంటర్వెల్ బాంగ్ కి Catalyst అన్నమాట (సెకండ్ Act లో ఇంటర్వెల్ కి ముందు అలాగే ప్రీ క్లైమాక్స్ టైం లో ఇలాంటి catalyst లు ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ని నిలబెడతాయీ ), అక్కడ నుంచి కేలకొద్దు వరకు మంచి బాంగ్ ఇచ్చి, ఇక్కడ నుంచి ఇంకా సెకండ్ హాఫ్ లో ఎంతో ఉండబోతుంది అనే ఆశ కల్పించి ఇంటర్వెల్ కార్డు ఇస్తాడు. హీరో ఫ్యామిలి కి కాళ్ళ ముందు జరిగిన అవమానం కి సమాధానం గా విలన్ కొడుకుని చంపేశాడు, సో ఇక నుంచి మాంచి రసవత్తరం గా కథ ఉండబోతుంది అనుకుంటాం మనం, కానీ ఆ అంచనాలని దమ్ము అందుకోక పోయింది, హీరో మీద కాకుండా మల్లి ఊరిలో పుట్టిన పిల్లల్ని చంపుకునే విలన్ మనకి కనెక్ట్ అవ్వడు. ఈ చావులకి ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్న హీరో అక్క భర్త ని చంపెయ్యటం తో, బతకండి బతకండి అంటే వినలేదు గా అంటూ ఇంకా ఎలాగైనా సమాధానం చెప్పాలి అనుకునే స్టేజి కి క్లైమాక్స్ మొదలు అవుతుంది. చంపే అంత కోపం ఉన్న చంపకూడదు అనే హీరో భావాలూ, అంత వరకు క్రూరం గా ఉండి డైలాగ్స్ కి మారిపోయే విలన్ వెరసి దమ్ము క్లైమాక్స్ లో దమ్ము లేకుండా చేసారు. ఒక సినిమా కి సెకండ్ Act ఎంత ఇంపార్టెంట్ అని ఇలాంటి సినిమాలని చూస్తే అర్ధం అవ్తుంది. మొత్తం కథ అంతా సెకండ్ ఆక్ట్ ని మలచిన తీరు అండ్ ఆ ఆక్ట్ కి ఇచిన ముగింపు మీద ఆధారపడి ఉంటై. ఇంద్ర, సమరసింహా రెడ్డి లాంటి సినిమాలని విశ్లేషించుకుంటే సెకండ్ ఆక్ట్ తాలుకు ఇంపార్టెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇదంతా మీరు , నేను, మనం అందరం సినిమా లో చూసిందే తప్ప నేను కొత్త గా చెప్పిండి ఏమి లేదు. సినిమా లు చూసి చూసి వాటి మీద కొంచెం టైం స్పెండ్ చెయ్యగలిగితే ప్రతి సినిమాని ఇలా విడమర్చి విశేషించుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చెయ్యండి, ఏమైనా సందేహాలు ఉంటె చెప్పండి, ఇంకా కొంచెం క్లియర్ గా కావాలి అంటే ఇంకో రెండు మూడు సినిమాల విశ్లేషణ పోస్ట్ చేస్తాను. ఈ విశ్లేషణ ఎందుకు అవసరం, తర్వాత ఎం చెయ్యాలి, అన్ని సినిమాలని ఇలాగె చూడాలా ఇలాంటివి టైం చూసుకొని ఇంకొక ఆర్టికల్ గా పోస్ట్ చేస్తాను.
ఇట్లు మీ హరి కృష్ణ రాజు
| |
0 comments:
Post a Comment