Wednesday, 6 March 2013

HARI THE HERO: First Day First Show: Pawan Kalyan

HARI THE HERO
Oka Cinema Pichodu
First Day First Show: Pawan Kalyan
Mar 6th 2013, 18:21



చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న ఆర్టికల్ఎప్పటికప్పుడు రాద్దాం లే అనుకుంటూ దాటవేసిన ఆర్టికల్ మద్య టీవీ లో ఖుషి  సినిమా చూసిన తర్వాత ఎలా ఐన రాయాల్సిన ఆర్టికల్ అనిపించి స్టార్ట్చేస్తున్నా... అసలు ఈ ఆర్టికల్ కి ఈ స్టార్టింగ్ ఏంటి అనుకుంటున్నారా చదివితే మీకే  తెలుస్తుంది లెండి ...

ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది ఎంత మందికి ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే ఫాన్స్ కి మాత్రం పండుగమాములుగా ఫాన్స్ కి వాళ్ళ వాళ్ళ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం పండుగ అయితేసినీ ప్రియులకిఅదే ఫాన్స్ మద్య కూర్చొని ఫస్ట్ డే ఫస్ట్ షో ని ఎంజాయ్ చెయ్యటం ఒక అద్బుతమైన ఫీలింగ్అంటే నా వరకు అది ఖచ్చితం గా అద్బుతమైన ఫీలింగ్ అలాంటి అనుభవాలు షేర్ చేసుకోటానికే  ఫస్ట్ డే ఫస్ట్షో సిరీస్ సిరీస్ లో ఇంతకు ముందు నాగార్జున అండ్ మహేష్ బాబు మూవీస్ ఎక్స్పీరియన్స్ చూశాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల విశేషాల గురుంచి చూద్దాం.  

కొణిదెల కళ్యాణ్ బాబు గా యావరేజ్ ఎంట్రన్స్ ఇచ్చినా కూడా పవర్ స్టార్ పవన్  కల్యాణ్  గా ఎదిగిన విధానం నా వరకు అసూయ తో కూడిన ఆశ్చర్యంఅది ఎలా జరిగింది అంటే... 




అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిసుకన్య ధియేటర్గోపాలపట్నం: అప్పుడప్పుడే నాగ్  ఫాన్స్ గా హంగామా స్టార్ట్ చేసిన రోజులునిన్నే పెళ్ళాడతా వచ్చి ఎన్నో రోజులు కూడా అయి ఉండదుఅప్పటికేచిరంజీవి గారి బిగ్ బాస్ వచ్చి.... పోయి... సినిమాలు లేక అల్లాడుతున్న ఫాన్స్ కి కళ్యాణ్ బాబు బొమ్మ హడావుడి చెయ్యటానికి ఉనికిని చాటుకో టానికి (గోపాలపట్నం లోఒక అవకాశం  గా రావటం వలనఫాన్స్ తో పాటు జనాలు అందరు కూడా  రిలీజ్ కోసం ఎదురు చూశారు . నాగ్  ఫాన్స్ కి ఏంట్రా పని ఇక్కడ అని అడగటానికి అవకాశం  లేకుండా మా హీరో చుట్టం  సినిమా లో హీరోయిన్ అవ్వటం వలనమేము కూడా ఎగేసుకొని పోయాం హెయిర్ స్టైల్ అండ్ అక్కడక్కడ లుక్స్  లో ఆల్మోస్ట్ చిరంజీవి గారే కనిపించారుసరదాగా సాగిపోతున్న సినిమా లో "కళ్యాణ్ ఒరిజినల్ గా చేసిన సాహస కృత్యాలుతెర మీద పడగానే ధియేటర్ దద్దరిల్లి పోయిందిస్క్రీన్ చూడటానికి పక్కన ఉన్న ఖాలీ ప్లేస్ లో నిల్చొని చూడాల్సి వచ్చిందిఫాన్స్ అసలు పూనకాలు ధియేటర్ లో,  సీన్స్ అయిపొఇన కూడా ఇంకా అరుపులుగోలనాకేమో కొంపతీసి  సినిమా మా బొమ్మ ని దెబ్బ వెయ్యదు  కదా అని భయం , వెయ్యకూడదు అని ధియేటర్ లో నే దేవుడుని కోరుకుంటున్నాకొబ్బరి కాయ కూడా కమిట్ ఐపోయాసెకండ్ హాఫ్కొంచెం స్లో ఐంది హమ్మయ్య అని నిట్టూర్పుమొత్తం అయ్యాక అబ్బే పెద్ద ఎం లేదు అని నేను సరిదిచేప్పుకున్నాకానీ ఫాన్స్ మాత్రం హిట్ అంటున్నారుఅందులోను ఫస్ట్ సినిమా అవ్వటం వలనో చిరుసినిమాలకి మొహం వాచిపోవటం  వలనో మొదట్లో బాగానే ఆదరించారుకానీ పక్కన మా బొమ్మ కుమ్మేసి  బొమ్మ ని యావరేజ్ చేసింది తర్వాత పబ్లిక్ పెర్ఫార్మన్స్ ఇవ్వటంపవన్ కళ్యాణ్ గా పేరుమారటం ఇవన్ని గమనిస్తూనే ఉన్నాం అనుకోండిఒక రకమైన చైల్డిష్ మెంటాలిటీ తో చూసిన FDFS అని గుర్తు వచినప్పుడు నవ్వుకుంటూ ఉంటా..

గోకులంలో సీతనరసింహ ధియేటర్గోపాలపట్నంఅప్పటికే హిట్లర్ రావటం మెగా ఫాన్స్ ఫామ్  లో కి రావటం జరిగిపోయాయికాని నా నమ్మకం ఏంటి అంటే ముత్యాల సుబ్బయ్య సినిమా లోఏముంటుంది లే ఫాన్స్ కి అనిషో స్టార్ట్ అయింది , సినిమాలో బూతులు స్టార్ట్ అయ్యాయిఒకటే బూతు కామెడీ తో వెళ్తుంది సినిమాసూపర్ ఫ్యామిలీ  సినిమా లో బూతులుఅవుట్ తాడి మట్టయ్య అవుట్హరీష్ కి పాట , ఫాన్స్ వాక్ ఔట్స్ ఓహో మళ్ళి  అవుట్ తడి మట్టయ్య అని ఎందుకో తెలియని ఆనందంకాని ఉన్న రెండు చిన్న ఫైట్ కి వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందొ ఈడు కనక యాక్షన్ సినిమాతీస్తే పట్టుకోలేము సుమీ సరేలే బాస్ కి ఇంకా టైం ఉంది ప్రస్తుతానికి లిస్టు లో నుంచి తీసేయొచ్చు అని డిసైడ్ అయిపోయా . రీమేక్ కి ఇంకేం దొరకలేదా వీడికి అనుకున్నా

తొలిప్రేమసుకన్య ధియేటర్గోపాలపట్నంముందు చెప్పుకున్నట్టు లిస్టు లో నుంచి తీసెయ్యటం వలన సుస్వాగతం సినిమా FDFS  చూడలేదుకానీ  తర్వాత చాల సార్లు చూసి బాగా ఎంజాయ్ చేశానుఅనుకోండి క్లైమాక్స్ లో డైలాగ్స్ చాలా  రోజులు మైండ్ లో నిలిచి పోయాయిరీమేక్ అయినా  కూడా కుమ్మేసాడు అని నేనే చాల మందికి రికమండ్ చేశా ఇయర్ లో అప్పటికే ఆవిడ మా ఆవిడే , ఆటోడ్రైవర్ దెబ్బ తిని ఉన్న మా కాన్సంట్రేషన్ పక్క హీరోస్ పై ఉండటం సమంజసం కదాసో సాంగ్స్ వచినప్పటి నుంచి తొలిప్రేమ మీద అంచనాలు ఉన్నాయ్ఒకటి ఫుట్ బాల్  సాంగ్ ఉండటంఇంకోటి అసలుడ్యూయెట్  లేక పోవటంఅన్నిటికి మించి సాంగ్స్ బావుండటం మూవీ కోసం వెయిట్ చేసేలా చేసాయి , ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటేదగ్గరలో మా చంద్రలేక రిలీజ్ ఉండటం వలన  లో పే సినిమాచూసేస్తే మా చంద్రలేక హ్యాపీ  ఒక పది పదిహేను సార్లు చూసుకోవచ్చు అనే స్కెచ్ కూడా ఉంది నాకు రోజు రానే వచ్చింది విధం ఐన కంప్లైంట్స్ లేకుండా మూవీ ఒక రేంజ్ లో వెళ్తుందిధియేటర్ లోహంగామా కూడా అలాగే ఉందిసడన్ గా బైక్ మీద పాప ని సేవ్ చేసే సీన్ఒక్క రెండు సెకన్స్ తర్వాత రివైండ్ చేస్తే సీట్ లో నుంచి లేచిఅరిచిచప్పట్లు కొట్టాను అని పక్కోడు చెప్పాడుఅక్కడ నుంచి మూవీలో లీనం అయిపోయాఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమా పూర్తిగా ఎంజాయ్ చేసిన FDFS. కొట్టాడు రా కుర్రోడు అని అసూయ గాకళ్యాణ్ హెయిర్ స్టైల్ యూత్ స్టైల్ అయిందిడ్రెస్ లుసినిమా లో వాడినమోడల్ బైక్ లు రోడ్లని  నింపేసాయిచాల సార్లు చూడాలి అనుకున్న చంద్రలేక కొట్టిన దెబ్బకి తొలిప్రేమ ఆయింట్మెంట్ అయ్యిందిధియేటర్ లో ఎన్ని సార్లు చూసానో లెక్క పెట్టడం కూడామానేశాను..చూస్తూనే ఉన్నాను.

తమ్ముడుబాలాజీ ధియేటర్విజయనగరంఅప్పటికి మాకు చెప్పుకునే రేంజ్ సినిమాలు లేక పోవటంఆల్రెడీ పవన్ అంటే ఒక సాఫ్ట్ కార్నెర్  ఉండటంఒక నెల ముందు మహేష్ బాబు హీరో గా వచ్చినసినిమా రావటం అండ్ హిట్ టాక్ తెచ్చుకోవటం తమ్ముడు సాంగ్స్ సూపర్బ్ గా ఉండటంచాలా  సాంగ్స్ కి పవన్ డాన్స్  కంపోస్ చేశాడు  అనే టాక్ వచేయ్యటం సినిమా పై అంచనాలకి ఆకాశమే  హద్దు అనే రేంజ్ కి ఉండగాట్రావెలింగ్సోల్జర్ సాంగ్ తెర మీద ఎలా ఉండ బోతుంది అనే కుతూహలం వెరసి పొద్దునే ధియేటర్ దగ్గర మార్నింగ్ షో కోసం పడిగాపులు కాసేలా చేశాయి . సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్  వరకు ధియేటర్ మొత్తం రచ్చ రచ్చ అసలు ఫస్ట్ సాంగ్ లో పవన్ స్టెప్స్ కి పక్కోడి చేతిలో పేపర్స్ లాక్కొని మరీ విసిరేసి ఎంజాయ్ చేశాం, ఇంటర్వెల్ టైమ్ కి తెచ్చుకున్న పేపర్స్ ఐపోతే ఆల్రెడీ విసిరిన  పేపర్స్ ఏరుకొని సెకండ్ హాఫ్ లో మళ్లి విసిరామ్ . బేసిక్ గా అప్పటికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ లో చదువుతూ ఉండటం, పక్కనే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ ఉండటం సినిమాలో కాలేజీ ఎపిసోడ్స్ అన్ని బాగా కనెక్ట్ అయిపోయా. మోడల్ కాలేజీ రిచ్ కిడ్స్ కి మా గవర్నమెంట్ కాలేజీ జనాలకి మద్య ఉండే ప్రొబ్లెమ్స్ పేస్ చేస్తే కానీ తెలియదు అనే టైపు లో, ఇంట్లో క్లాసు లు పీకే ఫాదర్ అన్నని మాత్రమే మేచుకుంటే మన బేవార్స్  బాచ్ బయట చేసే ఎంజాయ్మెంట్ లు అబ్బో అదంతా ఫస్ట్ డే ఫస్ట్ షో లో తెర  పై చూస్తుంటే పూనకం అనే పదం చిన్నబోయేలా  ఊగిపోయా ధియేటర్ లో. అన్నిటికి మించి ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ఎంత బలం గా నాటుకు పోయింది అంటే ఇప్పటికి నా రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ మీద పూల  కుండి  ని చేతితో పగలగోట్టినప్పుడు తెగిన మార్క్ ఉంటుంది. ఇది టైపు చేస్తున్నప్పుడు కూడా చూస్తూ నవ్వుకునే అంత స్వీట్ మెమరీ. తమ్ముడు సినిమా ఎన్ని సార్లో చూశా , చూసిన ప్రతి సారి ఫస్ట్ టైం చూసినప్పటి అనుబూతి ఇప్పటికి మర్చిపోలేను. 

బద్రి, NCS  ధియేటర్, విజయనగరం: మెగా ఫాన్స్ కి అన్నయ ఇచిన ఊపు, నాకు నువ్వు వస్తావని ఇచిన గౌరవం, వారం రోజులు ముందు రిలీజ్ ఐన యువరాజు దువ్విన కాలు (అప్పటికి వార్స్ స్టార్ట్ అయ్యాయి లెండి, తమ్ముడు సీన్ ని  కాపీ కొట్టారు యువరాజు లో తెలిపొఇన్ది అని) బద్రి మీద ఎవరి అంచనాలు వాళ్ళవి, నాకేమో సాంగ్స్ లో మూడు కుమ్మేయగా మిగతావి బాగా తేడా కొట్టాయి దానికి తోడు కొత్త డైరెక్టర్ సినిమా, ఏముంటుంది లే అనుకుని వెళ్ళిన తర్వాత బ్లాక్  కి 150 పెట్టాక  అర్ధం అయింది  అంచనాలు ఎలా ఉన్నాయ్ అని. టైటిల్స్ అవ్వగానే ఇండియన్ సాంగ్, సాంగ్ లో ఊపు ఉంది కానీ ఏదో కొత్తగా తీసాడు, తమ్ముడిలా డాన్సులు లేకుండా అనుకున్న, ఒక పావుగంట కి జనాల్లో ఊపు తగ్గి చతికిల పడ్డారు, కామెడీ అవుతుంది, సాంగ్స్ అవుతున్నాయి, కామ్ గా చూస్తున్నారు. ఇంటర్వెల్ బయట నెక్స్ట్ షో కోసం వెయిట్ చేస్తున్న  వాడు ఎలా ఉంది అని అడిగితే, బొంగు లా ఉంది అని చెప్పబోయా, అప్పటికే పక్కన ఒక సోదరుడు దొబ్బింది అని చెప్పటం రెండు దెబ్బలు తినటం అయిపోయాయి , దొరికితే నాగ్  ఫ్యాన్ బాడ్ టాక్ చెప్తున్నాడు అని నన్ను కుమ్మేస్తారేమో అని సైడ్ అయిపోయా. సెకండ్ హాఫ్ లో నువ్వు నంద అయితే నేను బద్రి డైలాగ్ కి లేచింది అయ్యా ధియేటర్, ఒక పది నిముషాలు అరుస్తూనే ఉన్నారు, సినిమా మొత్తం అయిపోయాక మా వాడికి హిట్ పడితే కళ్యాణ్ కి యవేరేజ్ సెంటిమెంట్ ఏమో, ఐన ముందు సినిమా లో ఏవో సాంగ్స్ తీశాను  కదా అని ఈ సరి ఏకం గా సినిమా మొత్తం తీసేసినట్టు ఉన్నాడు, ఈడి పైత్యం  అని నాలో నేను నవ్వుకుంటూ వెళ్ళిపోయా. ఒక 2 వారాలు తర్వాత తెలిసింది, మా వాళ్ళు బ్లాక్  లో కొని చూశారు  అని, దిమ్మ తిరిగి మేటర్ ఏంట్రా అంటే నెమ్మదిగా పికప్ అయిపోతుంది సినిమా అని. రెండో సారి, మూడో సారి చూస్తున్న కొద్ది నచ్చేస్తుంది సినిమా. అప్పుడు అనుకున్న ఈడిలో  ఏదో మేజిక్ ఉంది సామి, జనాల నాడి పట్టేశాడు  అని. పవన్ కళ్యాణ్ అనే ఒక స్టార్ హీరో కమర్షియల్ స్టామినా  ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన సినిమా అని నా ఉద్దేశం 

ఖుషి, హిమగిరి ధియేటర్, విజయనగరం: ఏప్రిల్ 27 2001 ఒక అద్బుతం ఆవిష్కరించబడిన రోజు, మాకేమో ఆ ఇయర్ బంపర్ బొనంజా ఫ్లాప్స్, చిరు వెంకి ల కి కూడా కలిసి రాలేదు, బాలయ్య అండ్ మహేష్ అప్పటికి వరసగా రెండు నెలల్లో హిట్స్ కొట్టారు, అప్పటికి తమిళ్ ఖుషి చూసేసి ఇదేదో హీరోయిన్ ఓరియెంటెడ్ బొమ్మ లా ఉంది ఇది ఎందుకు చేస్తున్నాడు అబ్బ అనుకున్నాం, కానీ సాంగ్స్ అలంటి ఇలాంటి హిట్స్ కాదు అప్పటికె కళ్యాణ్ కి   సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఇంకా ఈ సినిమా కి వచ్చిన అంచనాలు అలా ఇలా లేవు. విజయనగరం లో ఒకప్పటి మయూరి సినిమా ధియేటర్ ని హిమగిరి సప్తగిరి గా మార్చారు, సిగ్నల్ నుంచి స్టార్ట్ ఐన ధియేటర్ రోడ్ లో నే SP  బంగ్లా ఉంటుంది. ఆ రోడ్ మొత్తం జామ్. పొద్దున్న 7 కె ధియేటర్ దగ్గరకి వెళ్ళిపోయాం నేను న చిన్ననాటి ఫ్రెండ్ భాస్కర్ మాకు హిమగిరి లో దొరికాయ్ టికెట్స్ (నాన్ ac  ధియేటర్ అవ్వటం వలన బ్లాక్  లో తక్కువకి)మార్నింగ్ షో టైం అవుతుంది జనాలు అందరు రోడ్ మీదనే ఉన్నారు, బాక్స్ లేట్ ఐంది అన్న విషయం  అర్ధం అయింది, కానీ జనాలు అందరు సిగ్నల్స్ వైపు పరుగులు పెడుతున్నారు, ఆ వెనక  కర్రలతో పోలీసులు, క్రౌడ్ కంట్రోలింగ్ కి అప్పటికే రెండు మూడు సార్లు లాటి ఛార్జ్ అయింది. సగం క్రౌడ్ ఏమో SP  బంగ్లా వైపు సగం సిగ్నల్స్ వైపు మద్య లో పోలీసు లు. ఇంకా లాభం లేదు అని టికెట్స్ ఉన్న వాళ్ళని థియేటర్స్ లోపలికి పంపేసారు, బాక్స్ రాలేదు అని తెలుసు, బయట ఉండే అవకాసం లేదు, సో హిమగిరి లో కూర్చున్న మాకు అంత ముందు వరకు ఆడుతున్న డబ్బింగ్ సినిమా వేశాడు. లోపల పెట్టేసి తలుపు వేసాక అది చూడలేము బయట ఎం జరుగుతుందో అని టెన్షన్, బాక్స్ స్టేటస్ ఏంటి అని కూడా టెన్షన్, ఒక 40నిమిషాల తర్వాత ఖుషి సెన్సార్ సర్టిఫికేట్ స్క్రీన్ పై పడింది, ఇంక అప్పటి వరకు వెయిట్ చేస్తున్న జనాల రెస్పాన్స్ ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. ఖచ్చితం గా మీరు ఊహించిన దానికి పది రెట్లు ఎక్కువే ఉంది. ఫస్ట్ 20 నిముషాలు బాగా స్లో గా ఏదోలా ఉంది అని చతికిల బడిన ఫాన్స్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి కాలేజీ లో జాయిన్ ఐన దగ్గర నుంచి లాస్ట్ లో ఎండ్  టైటిల్స్ వరకు కుమ్మి అవతలేసారు. అసలు ఎవరు ఐన సీట్స్ లో కూర్చుంటే కదా ఇంటర్వెల్ లో గొంతులు పట్టేసి కూల్ డ్రింక్స్ పట్టించుకోని సెకండ్ హాఫ్ కి రెడీ ఐ సీట్ దగ్గర నిల్చున్నాం, సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ కుర్చోనివ్వలేదు అని న కవి హృదయం. సగానికి పైగా డైలాగ్ లు నాకు థర్డ్ టైం చూసినప్పుడే పూర్తిగా అర్ధం అయ్యి అది కూడా వన్ వీక్ తర్వాత. ఈ సినిమా సప్తగిరి ధియేటర్ లో 50,100,150 అండ్ 175 డేస్ రోజు సెకండ్ షో లు మిస్ కాలేదు, ఆ హంగామా ఇప్పటికి మదిలో పదిలం గా ఉంది. సప్తగిరి ధియేటర్ లో 22సార్లు చూశాను  ఈ సినిమా ని చూసిన ప్రతి సారి FDFS  హంగామా కళ్ళముందే ఉండేది. నా విజయనగరం సినిమా ప్రస్థానం లో ఇది ఒక గోల్డెన్ చాప్టర్, న బూతో న భవిష్యట్,  మొన్న టీవీ లో చూసినప్పుడు కూడా ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకోబట్టే ఈ రోజు ఈ ఆర్టికల్ రాయటం మొదలు పెట్టింది కూడా. 

జానీ, బాలాజీ ధియేటర్, విజయనగరం: మా వోడు సంతోషం, మన్మధుడు తో మంచి ఊపు లో ఉన్నాడు, ఖుషి వచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఐంది. సొంత కళ్యాణ్ బాబు డైరెక్టర్ అనగానే ఒక సరి బద్రి సినిమా ఫస్ట్ డే షో అయిపోయాక  నా ప్రిడిక్షన్ నిజం అయినందుకు సంతోషం గా ఉన్న టైం లో ఆడియో రిలీజ్ అవ్వటం, ఆడియో టైం లో వచ్చిన పోస్టర్ లో కళ్యాణ్ లుక్ ఇంక ఈ సినిమా కి హద్దు లేదు అనుకున్నా, ఈ మద్యలో ఒకటి అయింది. చిరు డాడీ సినిమా రిలీజ్ కి విజయనగరం రంజిని ధియేటర్ దగ్గర క్రౌడ్ కి మతి పోయి వెళ్తున్న బస్సు లో నుంచి దిగిపొఇ ఏంటి ఫ్యామిలీ  సినిమా కి కూడా ఈ రేంజ్ అః అనుకుంటూ ఒకడిని ఆపి ఏందీ ఈ జనాలు అంటే, పవన్ కళ్యాణ్ ఈ సినిమా లో ఫైట్ లు కంపోస్  చేసాడు తెలుసా అన్నాడు, అమ్మ దీనెమ్మ ఈ PK  గాడి  క్రజ్ కి దన్నం రా అయ్యా అనుకున్నా , కట్ చేస్తే గోపాలపట్నం లో కళ్యాణ్ సినిమా మార్నింగ్ షో చూసి చాల రోజులు ఐంది టికెట్ చెప్పండి అని అడిగితే, చిరంజీవి సినిమా కి ఐన టికెట్స్ దొరుకుతాయి కానీ కళ్యాణ్ ని అడగొద్దు అన్నారు, బ్లాకు ఎంత ఉన్దోచు అంటే, 1000-1500 మద్య లో అన్నారు, అన్ని మూసుకొని విజయనగరం బాలాజీ లో 250 కి సెట్ చేసుకున్నా. సినిమా స్టార్ట్ అయింది , పది నిమిషాలకి ఫాన్స్ గోల, బయటికి వెళ్లి ప్రొజెక్టర్ రూం ముందు గొడవ, సౌండ్ సిస్టం బాలేదు అని, అది లైవ్ రికార్డింగ్ అంట, డైలాగ్స్ అలాగే ఉంటై , సైలెంట్ గా చూడమను అని డిస్ట్రిబ్యూటర్ నుంచి ఓనర్ కి కాల్, ఇంకో పావు గంట కి జనాలకి నెత్తురు చుక్క లేదు. ఎక్కడో లోలోపల ఒక ఘర్వమైన భావన, ఈడి పైత్యం నాకు అప్పుడే అర్ధం అయింది జనాలకే ఇంకా అర్ధం కాలేదు అని ఒక చిరు నవ్వు. సరేలే ఒక దెబ్బ పడితే లైన్ లో ఉంటాడు లే అని ఫీలింగ్. ఇంటర్వెల్ కె జనాలు నీరసించి పోయారు, సినిమా అయ్యాక చెప్తే నమ్మరు పొద్దున్న 250 కి కొన్న టికెట్ లు 50-70 కి అమ్ముతున్నారు. జనరల్ గా మార్నింగ్ షో అవుతున్నపుడే గేట్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు జనాలు, సౌండ్ లు వినటానికి గోల ని బట్టి టాక్ అంచనా కి రాటానికి, కానీ అప్పటికే బయటికి వచ్చే టైం కే జనాలకి మేటర్ అర్ధం అయిపాయింది. మా సినిమాలు హిట్ అవ్వటం వలనో ఏంటో పక్కోడి సినిమా పొఇనా కూడా ఆనందమే. విజయనగరం లో చూసిన ఆఖరి  FDFS  అఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఇలా గుర్తుండి  పోయింది. నాకు పర్సనల్ గా జాని సినిమా ఇష్టం, ఆ రోజు అలా అయిపోయింది  అంతె . 

గుడుంబా శంకర్, గోకుల్ ధియేటర్, హైదరాబాద్: పాటలు తెగ నచ్చేసి, క్రాస్ రోడ్స్ లో టికెట్స్ మన వల్ల  కాదు లే అని డిసైడ్ అయి గోకుల్ లో సెట్ చేశా. పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ పోలీస్ డ్రెస్ లో ధియేటర్ లో రీసౌండ్, డైలాగ్ మొదలు పెట్టాడు, అసలు ఏమైనా వినపదితేనా అది పూర్తి అయ్యేలోపు క్లియర్ గా  వినిపించటం మొదలు ఐంది, అంటే సౌండ్ తగ్గింది, సరే డైలాగ్ విందాం  అని జనాలు సైలెంట్ అయ్యారేమో అనుకునే టైం కి సగం జనం మెడ ఒక వైపు కి పెట్టడం మొదలు అయింది , చూస్తే నాది అలానే ఉంది, ఒక చెవి స్పీకర్ కి అప్పచెప్పి డైలాగ్ ఎం చెప్తున్నాడో అర్ధం చేసుకుందాం అనే నా ఆరాటం కి అంత మంది తోడు అవ్వటం వలన నా ప్రయత్నం ని విరమించుకొని బొమ్మ చూడటం మొదలు పెట్టా, సాంగ్స్ వచినప్పుడు గోల చేశారు ఓహో అవి ముందే వినేశారు గా సో అర్ధం కాక పోవటానికి ఏముంది లే, సాంగ్ అయి  సినిమా అవుతునప్పుడు మాత్రం అందరు సైలెంట్ ఐన డైలాగ్ అర్ధం అయ్యేది కాదు, ఈడి పిచ్చి తగ్గలేదు సరి కదా డబల్ అయింది అని నాలో నేనే మురిసిపోతూ ఫోన్స్ చేసి టాక్ చెప్పటం మొదలు పెట్టా . సినిమా ఇప్పటికి టీవీ లో వస్తే ఎంజాయ్ చేయ్యోచు కానీ ఆ రోజు ధియేటర్ లో మాత్రం చుక్కలు  

అన్నవరం, కాసినో ధియేటర్, చెన్నై: బాలు సినిమా సెకండ్ డే, బంగారం సినిమా చెన్నై లో రిలీజ్ లేక పోవటం వలన CD లో ను చూశాను, అన్నవరం టైం కి అప్పుడప్పుడే బాస్ దెబ్బ నుంచి కోలుకున్నాం (చెన్నై లో బాస్ విశేషాలు ఫస్ట్ డే ఫస్ట్ షో నాగార్జున పోస్ట్ లో ఉంటాయి) అంతకు ముందు నెల వచ్చిన సైనికుడు కూడా పోవటం ఇంక విజయ్ బాబు హిట్ సినిమా రీమేక్ అవ్వటం, కాసినో లో గుంపు బాగానే చేరారు, సినిమా అవుతూనే ఉంది, జనాలు గోల చేస్తూనే ఉన్నారు, PK  మాటలు అర్ధం అవుతూనే ఉన్నాయ్, కానీ ఎక్కడో సినిమా కి అస్సలు కనెక్ట్ అవ్వలేదు, ఎంట్రన్స్ లో ఎద్దుల బండి కి కత్తి  పదును పెట్టె సీన్ కే  పగలబడి నవ్వేసా , నాతో పాటు వచ్చిన వాళ్ళు పర్లేదు రా బాగానే ఉంది అంటున్నా కూడా, మైండ్ లో హిట్ రాకూడదు అని నేను బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవటం వలన నాకు పాజిటివ్ లు కనపడలేదు, సినిమా అయ్యాక అంత పాజిటివ్ టాక్ కూడా రాలేదు లెండి 

జల్సా, సత్యం సినిమాస్, చెన్నై: అప్పటికీ నాకు అర్ధం కానీ ప్రశ్న అసలు ఈ ఓపెనింగ్స్ ఎలా వస్తున్నాయి, ఇన్ని ఫ్లాప్లు ఇచ్చాక కూడా ? నేను చెప్పుకునే సమాధానం ఈడిలో  ఏదో మేజిక్ ఉంది సామి :) ఇంకో పాతిక ఫ్లాప్ లు ఇచ్చినా కూడా 26 వ సినిమాకి జనాలు లైన్ కడతారు. కట్ చేస్తే  త్రివిక్రమ్ గారి  అతడు, ఈ సినిమా ఆడియో ఎలా ఐన ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనిపించేలా చేసాయి . ఫాన్స్ పరం గా చేసిన హంగామా అంటూ ఎం లేదు కాని, ప్రశాంతం గా, మనస్పూర్తి గా ఎంజాయ్ చేస్తూ చూసిన సినిమా, సినిమా అయిపొఇన తర్వాత కూడా నైట్ డిన్నర్ వరకు డైలాగ్స్ డిస్కస్  చేస్తూనే ఉన్నాం, సెకండ్ డే అండ్ థర్డ్ డే కూడా మార్నింగ్ షో లు చూసిన సినిమా. అప్పటికి మనసు పెట్టి (నిజం గా చెప్పాలి అంటే ఒళ్ళు దగ్గరేట్టుకొని) చేస్తే PK  కి తిరిగులేదు 


గబ్బర్ సింగ్, కాసినో ధియేటర్, చెన్నై: ప్రీ రిలీజ్ హైప్, ప్రీమియర్ షౌస్ టాక్, ఎలా ఐన రచ్చ రచ్చ చెయ్యాలి అని డిసైడ్ అయి ధియేటర్ లోకి ఎంటర్ ఐన సినిమా. సెకండ్ హాఫ్ స్లో అంటున్నారు ఫస్ట్ హాఫ్ ఇరగ కుమ్మేయ్యాలి అంతే ఫిక్స్ అయి సీట్ లో కూర్చున్న సినిమా, ఒక తమ్ముడు, ఒక ఖుషి టైం లోకి వెళ్లిపోవాలి అని నాకు నేను చెప్పుకున్న సినిమా, ఈ సినిమా అనుభవం షేర్ చెయ్యాల్సిన అవసరమే లేదు అనుకుంటా, ఆ రోజు నాతో పాటు చూసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, లైవ్ కూడా ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాం. ఫస్ట్ 15 నిమిషాలకే గొంతు పోయేలా అరిచేశాం, ఇంకా అక్కడ నుంచి క్రాంతి బాబు తో విజిల్స్ వేయించటం, న్యూస్ పేపర్ లు పొందిగ్గా చింపి విసరటం, ఆఖరికి ఐటెం సాంగ్ టైం కి సీట్ లో నుంచి లేచి వెళ్లి ఖాలీ ప్లేస్ లో డాన్సులు చెయ్యటం, వాట్ నాట్, ఒకానొక టైం లో ఆంధ్రా లో చేసిన హంగామా లో నా వరకు ఒక 30% చేసి ఆత్మ సంతృప్తి పొందిన సినిమా. ఇప్పుడు తలుచుకుంటే సిల్లీ గా ఉంటుంది, కానీ ఆ రోజు ధియేటర్ లో మాత్రం అరాచకం, FDFS కి ఫాన్స్ కి ఈ సినిమా ఒక విందు భోజనం. 

ఫస్ట్ లో సినిమాలతో యవరాజ్ గా అనిపించిన కళ్యాణ్, తర్వాత సినిమాలతో  ఇంప్రెస్స్ చేసి, అసూయ పడే రేంజ్ వరకు ఎదిగి, అంచనాలు మించి క్రేజ్ సంపాదించుకున్నాడు. అప్ అండ్ డౌన్స్ ఉన్న ఈ కెరీర్ ని ఫస్ట్ సినిమా నుంచి ఫాలో అవుతూ వస్తున్న నాకు గుర్తుండి పోయే జ్ఞాపకాలు ఇచ్చిన PK మీద ఇప్పటికీ  తగ్గని అసూయ తో 

మీ హరి కృష్ణ రాజు 

You are receiving this email because you subscribed to this feed at blogtrottr.com.

If you no longer wish to receive these emails, you can unsubscribe from this feed, or manage all your subscriptions

0 comments:

Blog Archive