Wednesday 26 September 2012

HARI THE HERO: Cameraman Ganga Tho Rambabu Audio Review

HARI THE HERO
Oka Cinema Pichodu
thumbnail Cameraman Ganga Tho Rambabu Audio Review
Sep 26th 2012, 16:26



" పాట వచ్చి పదేల్లైంది, అయిన పవర్ తగ్గలా" ఇది రీసెంట్  గా  వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా లో ని డైలాగ్, నిజం గా ఆ పవర్ గురుంచి ఎవర్ని అడిగిన చెప్తారు మరి. అలాంటిది బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి కనీసం పది నెలలు కూడా అవ్వలేదు ఇక్కడ, ఇంక పవర్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. గబ్బర్ సింగ్ తో మాంచి హిట్ కొట్టి తను ఊపు లో కి రావటమే కాకుండా తన అబిమనుల్ని [ఊపు] టు ది పవర్ అఫ్ [ఊపు] లో కూర్చోబెట్టారు కళ్యాణ్, ఇంక ఈ ఊపు కి అడ్డు లేకుండా పోయింది . పదేళ్ళ క్రితం తనకి బద్రి చేసి పెట్టిన దర్శకుడు పూరి తో కలిసి కెమెరామెన్ గంగ తో రాంబాబు గా మన ముందుకి రాబోతున్నారు, మణి శర్మ ఇంతకు ముందు కళ్యాణ్ కి ఇచిన ఆడియో గురుంచి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు, సినిమా రిజేల్ట్ తో సంబంధం లేకుండా మంచి ఆడియో లు ఇచ్చిన మణి శర్మ ఈ సారి ఎలాంటి ఆడియో ఇచ్చారో చూద్దాం. 




ఈ సినిమా  లో పాటలు అన్ని భాస్కరభట్ల  గారు రాశారు

థీమ్ సాంగ్ 
సింగర్స్: హేమ చంద్ర, కారుణ్య, నరేంద్ర 

బాగా తెలిసిన ట్యూన్ తో పాట స్టార్ట్ అవుతుంది. కొంచెం బిల్లా థీమ్ మ్యూజిక్ ఛాయలు ఉన్న మాట వాస్తవమే, బిసినెస్ మెన్ పాట కూడా ఇలానే ఉంటుంది అనిపిస్తుంది. లిరిక్స్ లో హీరో ని ఎలివేట్ చేసే పదాలు కూడా ఉన్నాయ్, ఉదాహరణకి "రాం రాం రాం బాబు బాబు, అస్సలు ఉండదు డాబు, ఆరడుగుల ఆటం బాంబు" ఇలా అన్నమాట.   చాల చిన్న నిడివి ఉన్న బిట్ సాంగ్. 

పిల్లని చూస్తే 
సింగర్స్: కారుణ్య, చైత్ర 

మణి శర్మ పాటలు బాగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే. మణి పాట మాములుగా స్టార్ట్ అవుతుంది , మద్య లో తన మార్క్ బిట్ ఒకటి పెట్టుకుంటాడు, మిగతా సాంగ్ అంతా ఎలా ఉన్న ఆ బీట్ ఏది అయితే ఉందొ అది మాత్రం ఊపి వదిలేస్తుంది. అలాంటి టిపికల్ మణి సాంగ్ ఏ ఇది. సాంగ్ మాములుగా మొదలవుతుంది, చమ్మకు చల్లో బీట్ వచ్చే సరికి సాంగ్ లో ఎక్కడ లేని ఊపు వచేస్తుంది. డాన్సు కి కూడా మంచి స్కోప్ ఉన్న సాంగ్ అవ్వటం వలన, మంచి టైమింగ్ తో పడితే ధియేటర్ లో మోత మోగటం ఖాయం . చరణాల మద్య లో వచ్చే బీట్ కి పవన్ కనుక డాన్సులు వేస్తే ఇంక సీట్ లో కుర్చోనేది ఎవరు ? అసలు మనకి తెర కనపడుతుందా ? , సాంగ్ లో చరణాలు  జాగ్రత్త గా వింటే అప్పట్లో వచ్చిన NTR పాట గుర్తు వస్తుంది. 

జోరమోచ్చింది  
సింగర్స్: ఖుషి మురళి, శ్రావణ భార్ఘవి 

ఐటెం సాంగ్ అన్నమాట, మనం దీని త్రైలేర్ కూడా చూసాం అన్నమాట, ఇది మరొక కెవ్వు కేక కాదు కానీ, కొంచెం ఊపు ఉన్న సాంగ్, లిరిక్స్ లో మంచి కామెడీ ని జోడిద్దాం  అనుకున్నారు ఏమో కానీ అంత పండలేదు మరి. ఈ పాట లో బీట్ వింటే ఒకప్పటి చిరంజీవి గారి సాంగ్ గుర్తుకు వస్తుంది. సినిమా ఫ్లాప్ ఐన కూడా సాంగ్ ఇంక గుర్తుంది మరి. సినిమా లో ఎలా తీసారు అనే దాని పై ఆధారపడి ఉంటుంది. మాస్ కి రీచ్ అయ్యే సాంగ్. 

 ఏక్ స్ట్రఆర్డినరీ  
సింగర్ : హేమ చంద్ర 

హేమ చంద్ర తన స్టైల్ లో కుమ్మేసాడు, అప్పటి కృష్ణ సినిమా లో సాంగ్ టైపు లో ఉన్న కూడా, పవన్ కి కొత్త గా ట్రై చేసినట్టు ఉన్నారు అనిపించే లా ఉంది. కొంచెం స్లో సాంగ్ కాబట్టి జనాల్ని కట్టి పడేసే లా తీసి ఉంటారు అని ఆశిద్దాం. లిరిక్స్ లో కొంచెం ఏ పదాలు కూడా మిక్ష్ చేసినట్టు ఉన్నారు. ఈ పాట కి అతి పెద్ద అసెట్ గా హేమ చంద్ర ని చెప్పు కో వాలి. బీట్ కూడా బావుంది. మొన్న చూసిన వీడియో లా సరదాగా తీసి ఉంటె సినిమా లో మంచి రిలీఫ్ సాంగ్ అవ్వోచు. లేదంటే సిగరెట్ సాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయ్.

తలదించుకు 
సింగర్స్:  హేమ చంద్ర, కారుణ్య, శ్రీ కృష్ణ, నరేంద్ర 

జనాలకి మెసేజ్ ఇస్తూ వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తూ రాసిన పాట. బీట్ లో ఇంకొంచెం ఊపు ఉండాల్సింది. లిరిక్స్ సాంగ్ కి తగ్గట్టు గా ఉన్నాయ్. ఇది కూడా ఒక బిట్ సాంగ్. జనాల్లో ఆవేశం రేకేతించే అంత పవర్ లిరిక్స్ లో ఉన్నా ఆ ఫీల్ ని సాంగ్ లో సగమే క్యారీ చేసారేమో అనిపించింది. మరి మిగతా సగం తెర పై చూద్దాం 

మెలికలు 
సింగర్స్ : నరేంద్ర, గీతా మాధురి

సాంగ్ స్టార్ట్ అవ్వగానే, బావ ఇదేదో వేరే బాష లో నుంచి ఎత్తేసిన  సాంగ్ అంట రా అని నా కజిన్ చెప్పిన మాటలు గుర్తోచై. ఎక్కడ నుంచి తీస్తే ఏందీ, ఈ టైపు సాంగ్ లో పవన్ ని ఊహించుకుంటేనే రచ్చ రంబోలా అసలు. ఖచ్చితం గా మా రాజు సుందరం కే ఇచ్చి ఉంటారు, ఇంక ఆయన స్టైల్ లో పవన్ కళ్యాణ్ స్టెప్స్ ఎస్తుంటే నా సామి రంగా దుమ్ము లేచిపోద్ది. బిట్ చాల బావుంది. సాంగ్ క్రెడిట్ మణి కి ఇచ్చిన ఇవ్వక పాయిన ఈ ట్యూన్ ని మనకి పరిచయం చేసినదుకు ఐన థాంక్స్ చెప్పాలి. సింగర్స్ ఇద్దరు కుమ్మేసారు, లిరిక్స్ కూడా సింపుల్ గా కాచి గా ఉన్నాయ్. సినిమా లో ఏ టైం లో పడిన ఊపు పెంచే సాంగ్ అవుతుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పుకోవచ్చు. 

ఓవరాల్ గా: పూనకం లో ఉన్న పవన్ ఫాన్స్ కి పిచ్చి రేకించే ఆడియో. ఫుల్ సౌండ్ లో రిపీట్ హియరింగ్ లో మొదట్లో నచ్చని  ఫాన్స్ కి కూడా నచ్చేస్తై. ఆడియో లో మాస్ సాంగ్స్ అన్ని ఊపు పెంచేవి ల ఉన్నాయ్, మిగతావి ఎందుకు ఉన్నాయా అనిపించే లా ఉన్నాయ్. మూడు సాంగ్స్ బావున్నై, బిట్ సాంగ్స్ ని పక్కన పెట్టేస్తే ఆడియో సినిమా కి ప్లస్ అని చెప్పుకోవచ్చు. గబ్బర్ సింగ్ వేడి తగ్గక ముందే రాబోతున్న కేమెర మాన్ గంగ తో రాంబాబు అదే ఊపు లో ఇంకో పెద్ద హిట్ కొట్టాలని ఆశిస్తూ. అల్ ది బెస్ట్ తో CGTR టీం. 

అచ్చు తప్పులు ఉండ వచ్చు .... మన్నించగలరు ............................... మీ హరి కృష్ణ రాజు 

You are receiving this email because you subscribed to this feed at blogtrottr.com.

If you no longer wish to receive these emails, you can unsubscribe from this feed, or manage all your subscriptions

0 comments:

Blog Archive