Saturday 2 June 2012

HARI THE HERO: Adhinayakudu Movie Review by Prekshakudu

HARI THE HERO
Oka Cinema Pichodu
Adhinayakudu Movie Review by Prekshakudu
Jun 3rd 2012, 04:53


మన బ్లాగ్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రేక్షకుడు తన మొదటి ప్రయత్నం గా అధినాయకుడు రివ్యూ ని మనకోసం అందిచాడు. కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన రివ్యూ తన మాటల్లోనే చూద్దాం.

 బాలయ్య బాబు హీరోగా గత సంవత్సరం డిసెంబర్లో షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల కావాల్సిన 'అధినాయకుడు' ఆర్ధిక సమస్యల్లో పడి, కొందరు రాజకీయ నాయకుల స్వలబ్ది కోసం ఆర్ధిక సాయం చేయగా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా  1-6-12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


హీరో:
 తన కెరీర్లో ఎన్నో విచిత్రమైన ప్రయోగాలూ చేసే బాలకృష్ణ త్రిపాత్రాభినయం ఒక్కటే మిగిలి ఉందని గుర్తొచ్చిందేమో దాని మీద పడ్డారు. బాలయ్య త్రిపాత్రాభినయం విషయానికి వస్తే బాబి (మనవడు), రామకృష్ణ ప్రసాద్ (తండ్రి), హరిశ్చంద్ర ప్రసాద్ (తాత) అనే మూడు విభిన్నమైన పాత్రలు పోషించారు. సినిమాలో మనకు మొదట పరిచయం చేసేది బాబి పాత్ర గురించి కాబట్టి ఆ పాత్ర గురించి మాట్లాడుకుందాం. 

బాబి: 50 + వయసులో  25 + యువకుడి పాత్ర పోషించారు బాలయ్య. ఈ వయసులో యువకుడి పాత్ర చేయడమే విడ్డూరం. యువకుడి పాత్ర అంటే ఎలాంటి హీరో అయినా కనీస జాగ్రత్తలు తీసుకుంటాడు. మరి నటనలో పాతికేళ్ళ అనుభవం ఉన్న ఆయన ఏం చేసాడు? కనీసం ఎలాంటి విగ్ సెలెక్ట్ చేసుకోవాలి? ఎలాంటి కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? ఆయన బాబి పాత్ర అవతారం చూసి బాబి యూత్ నమ్మడం ఏమో కాని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు హీరోలు హీరొయిన్ బ్యాక్ బంపర్ అని పాడుకునే వారు. ఈ సినిమా పాటల్లో బాబి బ్యాక్ బంపర్ అని మనం పాడుకోవాలి. ఈయన ప్రొఫెషనల్ కిల్లర్ మీడియా ముందు స్టేట్ మెంట్స్ ఇస్తుంటాడు.   

ఇదే పాత్రని కళ్యాణ్ రామ్ కి ఇచ్చి ఆ పాత్ర నిడివి తగ్గించి ఉంటే బావుండేది కదా! అన్ని పాత్రలు నేనే చేయాలన్న ఆవేశంతో ప్రేక్షకులను భయపెట్టి ఆయన అభిమానులకి చేదు అనుభవాన్ని మిగిల్చాడు.

రామకృష్ణ ప్రసాద్: సినిమాలో ఈ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువ. కానీ ఈ పాత్రకు కూడా అనవసరమైన గడ్డం, విచిత్రమైన విగ్ పెట్టారు. కాకపోతే ఈ పాత్రకు రాసుకున్న సంభాషణలు బావుండటంతో పాత్ర పై ఆసక్తి కలుగుతుంది. ఎవరో చేసిన నేరాన్ని తన మీద వేసుకుని తండ్రి కోపానికి గురి అవడం, పెరట్లో పని వాడి లాగ పెరుగుతూ తండ్రిని కాపాడుకుంటూ ఉంటాడు.   తండ్రి చనిపోయిన తరువాత కూడా రామకృష్ణ ప్రసాద్ అదే పెరట్లో పని వాడి లాగా ఎందుకు ఉంటున్నాడో అర్ధం కాదు. తండ్రి ముందు తన మీద పడ్డ కోసం పెరట్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నా బాబి మొదటి సారి ఇంటికి వచ్చినపుడు కారు దిగి ఆవేశంలో ఇంట్లోకి రాబోతాడు!! అసలు ఆ ఇంట్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశమే లేనప్పుడు ఎందుకు వెళ్ళబోయాడు. తండ్రి ఉన్నంత కాలం చేయని తప్పు భరించిన తండ్రి చనిపోయాక అయినా ఇంట్లోకి వెళ్ళడానికి ప్రాబ్లం ఏమిటి?? ఇలా ఈ పాత్ర సరిగ్గా డిజైన్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. 

హరిశ్చంద్ర ప్రసాద్: పైన చెప్పుకున్న రెండు పాత్రల గెటప్ విషయం గాలికి వదిలేసిన దర్శకుడు ఈ పాత్రకు మాత్రం మంచి గెటప్ డిజైన్ చేసుకున్నాడు. కాని ఆ పాత్రకు తగ్గ సీన్లు రాసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. ఈ పాత్ర ఏ మాత్రం పవర్ఫుల్ గా లేకుండా సాగింది. లండన్లో జరిగిన ఇంగ్లాండుకి చెందిన వాళ్ళు తెలుగులో మాట్లాడుకోవడం మరీ విడ్డురం. సరే  మన సౌకర్యం కోసం అక్కడి పాత్రలు తెలుగు మాట్లాడుకుంటాయి అనుకుందాం. తెలుగు వారు ఇండియాని వదిలి ఇంగ్లాండుకి సేవ చేస్తూ ఇండియాని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అన్నట్లు చూపిస్తే బావుండేది. 

హీరోయిన్స్ :
దీప్తి అనే పాత్ర పోషించిన లక్ష్మి రాయ్ నటన కంటె అందాల ఆరబోత మీదే ఆసక్తి చూపించింది. ఆమె బాబి (యూత్ బాలయ్య) మచ్చ చూడడం కోసం అయన వెంట పడే సీన్లు చూస్తే భయమేస్తుంది. ఇంకా వీరిద్దరి మధ్య ఉన్న పాటల విషయం గురించి మాట్లాడుకోక పోవటమే మంచిది. సినిమాలో సలోని సెకండ్ హీరొయిన్ అన్నంత బిల్డప్ ఇచ్చి కేవలం ఒక్క పాటతో నిరాశ పరిచారు. ఓలమ్మి పాటలో బాలయ్య గెటప్ బాగాలేకపోయినా సలోని మాత్రం బావుంది.

విలన్స్:
ఎంతో అనుభవం ఉన్న కోటా  శ్రీనివాస రావు లాంటి నటుడిని సరిగా వాడుకోలేకపోవడం పూర్తిగా దర్శకుడి తప్పు. హీరోకి విగ్ ప్రాబ్లం ఉన్నట్లు కోట గారి విగ్ కూడా సరైనది సెలెక్ట్ చేయలేదు. రామప్ప అనే పాత్ర చేసిన ప్రదీప్ రావత్ ఆకారం గరిష్టం ఆలోచన కనిష్టం అన్నట్లు ఉంది. అసలు హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్యామిలీకి ఈయనకి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అన్న పాయింట్ బలంగా లేదు. డిజిపి పాత్ర చేసిన మురళి శర్మ అసలు ఈయన సరే సరి. రామకృష్ణ ప్రసాద్ ని చంపబోతూ మీడియాలో లైవ్ వీడియో చూపించిన సస్పెండ్ అవడు. డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్న దండేసి దండం పెట్టాలి. చరణ్ రాజ్ సొంత డబ్బింగ్ చెప్పి భయపెట్టాడు. ఆత్మ హత్య చేస్కోవడానికి బాల్కనీ నుండి దూకే సన్నివేశం మంచి కామెడీగా ఉంటుంది.

కమెడియన్స్:
బ్రహ్మానందం ఇంట్రడక్షన్ సీన్ బావున్నప్పటికీ అదే కామెడీ సాగదీస్తూ ఇంకా చాలు ఆపండ్రోయ్ అని జనాలు గోల చేస్తున్న కూడా ఆపలేదు. ఇంకా జేబులు కొట్టేసే వేణు మాధవ్ కామెడీ ప్లీజ్ ఇవి కామెడీ సీన్స్ నవ్వండి అన్నట్లు ఉన్నాయి. 

మ్యూజిక్:
అలా మొదలైంది సినిమాలో మంచి మ్యూజిక్ ఇచ్చి ఆకట్టుకున్న కళ్యాణి మాలిక్ ఎప్పుడో కోటి గారు వదిలేసిన ట్యూన్స్ అందుకున్నాడు. అందం ఆకుమడి పాట దారుణం. అదిగో మరియు ఊరంతా పాటలు తానే పాడి చెడగోట్టాడు. మస్త్ జవాని ఆ పాట ఏంటో నా దరిద్రం ఇలా కొట్టేసింది అనుకోవాలి.  పాట   బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో బానే ఉంది.

డైరెక్షన్:
పరుచూరి మురళి సినిమా ప్రారంభమైనప్పుడు ఒక కథ రాసుకుని అది నచ్చక ఫైట్ మాస్టర్స్ తో రోజు డిస్కషన్స్ (నాకు తెలుసు మీరు స్టొరీ డిస్కషన్స్ అనుకుంటారని, ఐదు నిముషాలు స్టొరీ డిస్కస్ చేసి మిగతా సమయం అంతా ఏం చేసారని నన్ను అడగగకండి) చేసి ఇష్టం వచ్చినట్లు స్టొరీ మొత్తం మార్చేసిన మహానుభావుడు. సినిమాలో ఏ పాత్రకు సరైన స్వభావం ఉండదు. ఎటు గాలి వీస్తే అటు వెళ్ళాలి అన్నట్లు విచిత్రంగా ప్రవర్తిస్తూ చూసే వాడు ఈ సినిమాకి ఎందుకొచ్చామా అనేలా చేసాడు. సినిమా ఎటు పోతే నాకేంటి నా రేమ్యురేషణ్ నాకు వస్తుంది అని దర్శకుడు అనుకున్నాడేమో. అసలు లాజిక్ అనే పదం వెతికినా దొరకదు దానిని సినిమాటిక్ లిబెర్తి అంటే ఇంక  మనం ఏమి చెయ్యలేని పరిస్థితి. అసలు ఒక పెద్ద హీరో తో సినిమా చేసే అవకాసం వచినప్పుడు దానిని ఇంత దారుణం గా use చేసుకున్న వ్యక్తి మన పరుచూరి మురళి అనటం లో అతిశయోక్తి లేదు.   ఈ దర్శకుడికి మరో సినిమా చేయడానికి ఛాన్స్ రావడం కష్టమే.  

చివరిగా :
 ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ సినిమా లో ఏముందో చూడాలి అని మీకు అనిపిస్తే ఆలస్యం చెయ్యకుండా మీ జేవితం లో విలువైన రెండున్నర గంటల్ని నాశనం చేసుకోండి. 

ఇట్లు 
ప్రేక్షకుడు .  

You are receiving this email because you subscribed to this feed at blogtrottr.com.

If you no longer wish to receive these emails, you can unsubscribe from this feed, or manage all your subscriptions

0 comments:

Blog Archive