Saturday 9 June 2012

HARI THE HERO: Endhukante Premanta Movie Review by Padmasri

HARI THE HERO
Oka Cinema Pichodu
thumbnail Endhukante Premanta Movie Review by Padmasri
Jun 9th 2012, 08:05



ఈ సినిమా గురించి ముందు మాట 

శ్రీ సవంతి మూవీస్ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే డీసెంట్ ఫ్యామిలీ సినిమా అని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే ... ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, రెడీ వంటి మంచి ఫ్యామిలీ సినిమాలు వచ్చాయి. మధ్యలో కొన్ని సినిమాలు నిరాశ పరిచినా మంచి నిర్మాణ సంస్థ అని అందరికీ నమ్మకం ఉంది. కందిరీగ వంటి కమర్షియల్ హిట్ తరువాత రామ్ చేస్తున్న సినిమా ఇది. రచ్చ వంటి మాస్ హిట్ తరువాత తమన్నా హీరొయిన్ గా వస్తున్న సినిమా ఇది. లవ్ స్టొరీ సినిమాలు అధ్బుతంగా తెరకెక్కించే డైరెక్టర్ కరుణాకరన్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ కాంబినేషన్లో ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ వంటి డీసెంట్ హిట్ సినిమాల తరువాత వస్తున్న సినిమా సినిమా ఎందుకంటే ప్రేమంట. ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్న ఈ సినిమా నిన్న విడుదలైంది. 


కథ 

సినిమా ఓపెనింగ్ సీన్ 1980లో కృష్ణ (రామ్) - శ్రీనిధి (తమన్నా) మధ్య లవ్ ఎపిసోడుతో స్టార్ట్ చేస్తాడు. ఆ కాలంలో ఆంధ్ర యూనివర్సిటీలో లేడీస్ స్పెషల్ బస్ ఉన్నట్లు చూపించారు. సరే ఆ విషయం వదిలేద్దాం. ఈ కథ మగధీర టైపులో విషాదాంతంతో ముగుస్తుంది. కట్ చేస్తే 2012లో మరో కథ స్టార్ట్ అవుతుంది. పారిసులో ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ సుమన్. రొటీన్ గానే అన్ని సినిమాల్లో లాగా ఈయనకు పని తప్ప ఫ్యామిలీ పట్టించుకునే తీరిక ఉండదు. ఈయన ఏకైక ముద్దుల కూతురు స్రవంతి (తమన్నా) భారీ సెక్యూరిటీ మధ్య పెరిగిన ఈమెకు ఫ్రీడం కరువవుతుంది. తన తండ్రి ఇంట్లో లేని సమయం చూసి స్నేహితులతో కలిసి సరదాగా టూరుకి వెళ్తుంది. అలా వెళ్ళిన ఆమె తిరిగి ఇంటికి తిరిగి రాదు. ఇండియాలో మరో కథ మొదలవుతుంది. కృష్ణ రావు (సయాజీ షిండే) కొడుకు రామ్ (రామ్) ఎటువంటి భాద్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు అని బిజినెస్ కోసం అంటూ రామ్ ని పారిసులో ఉండే తన ఫ్రెండ్ పుల్లారెడ్డి (నాగినీడు) దగ్గరికి పంపిస్తాడు. తను వచ్చింది బిజినెస్ పని మీద కాదు పనిష్మెంట్ మీద రామ్ కి అర్ధమవుతుంది. అక్కడి నుండి తప్పించుకిని ఇండియాకి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నంలో స్రవంతిని కలుస్తాడు. ఇద్దరు తమ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు. సరదాగా పారిస్ అంత తిరుగుతారు. రామ్ ఇండియాకి వెళ్ళడానికి స్రవంతి హెల్ప్ చేస్తుంది. ఇండియాకి వెళ్ళిన రామ్ కి స్రవంతి గత 6 నెలలుగా గాంధీ హాస్పిటల్లో కోమాలో ఉందనే నిజం తెలుస్తుంది. మరి ఇన్ని రోజులుగా తనతో ఉంది ఎవరు? పారిసులో ఉండాల్సిన స్రవంతి ఇండియాలో కోమాలో ఎందుకు ఉంది? ఇప్పుడు రామ్ ఎమ్ చేసాడు అనేది మిగతా సినిమా కథ.

ఎవరెవరు ఎలా చేసారు?
రామ్ తనవరకు బాగానే చేసాడు. టాలీవుడ్ హీరోల్లో డాన్సులు బాగా చేసే హీరోల్లో తను ఒకడిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎటొచ్చి సర్కస్ ఫీట్స్ తగ్గిస్తే బావుంటుంది. తమన్నాకి బాగా ఇంపార్టెంట్ పాత్ర దక్కింది. కాని సినిమాలో ఆమె పాత్ర (ఆత్మ) కి ఎవ్వరు కనెక్ట్ అవలేకపోవడంతో చేసిన శ్రమ అంతా బూడిదలో పన్నీరు అయింది. అందంగా ఉండే ఆమెకు మేకప్ ఎక్కువ వేసి చెడగొడుతున్నారు. నెగటివ్ రోల్ లో రిషిని ఎవరు సెలెక్ట్ చేసారో కాని దండేసి దండం పెట్టొచ్చు. అంతా గొప్పగా చేసాడు మరి. కోన వెంకట్ అయితే అధ్బుతం. మహానుభావుడు స్క్రిప్ట్, డైలాగ్స్ రాసుకోకుండా ఎందుకు మాకు ఈ టార్చర్. సీనియర్ తమిళ్ నటి అను హాసన్ రామ్ మేనత్తగా బాగా చేసింది. సయాజీ షిండే సెకండ్ హాఫ్ లో కొద్ది సేపు బానే నవ్వించాడు. బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, సుమన్ మిగతా వాళ్ళంతా డబ్బులిచ్చారు కాబట్టి తప్పదు అన్నట్లు ఏదో అలా కానిచ్చేసారు. 

టెక్నికల్ డిపార్టుమెంట్ వర్క్ ఎలా ఉంది?  
ఆడియో రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండి ఆడియో వీక్ అనే మాట వినిపిస్తుంది. సినిమా రిలీజ్ వరకు అది కంటిన్యూ అయింది. సాంగ్స్ స్క్రీన్ ప్రెజెంటేషన్ బానే ఉన్న సాంగ్స్ కి తగ్గ సిచ్యుయేషన్ లేక 'నీ చూపులే' సాంగ్ తప్ప ఒక్కటి కూడా బాలేదు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సో సో. పారిసులో తీసిన పార్టు వరకు సినిమాటోగ్రఫీ బావుంది. మిగతా పార్టులో సినిమాటోగ్రాఫర్ అండ్రూ మార్కు కనిపించలేదు. సినిమా చూసి బైటికి వచ్చాక ఈ డైలాగ్ బావుంది కదా అనిపించేలా డైలాగ్స్ ఒక్కటి కూడా లేదు. సినిమా అలా తీసారు నేనేం చేసేది అన్నట్లు ఎడిటర్ తన పని చేసుకుంటూ పోయాడు. ఈ సినిమాకి మెయిన్ విలన్ ఎవరో కాదు డైరెక్టర్ కరుణాకరన్. తెలుగు ఆడియెన్స్ ఏ మాత్రం అంగీకరించని దిక్కుమాలిన కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుని, దానికి తగ్గట్లుగా ఇంట్రస్ట్ క్రియేట్ చేయలేని స్క్రీన్ప్లే రాసుకుని అందరితో తిట్టించుకున్నాడు. ప్రొడ్యూసర్ రవి కిషోర్ గారు ఈ కాన్సెప్ట్ ని నమ్మి 20 కోట్లకు పైగా బడ్జెట్ ఎలా పెట్టారో ఆయనకే తెలియాలి. ఇన్ని సినిమాలు తీసిన అనుభవం ఉన్న ఆయన ఇలాంటి సినిమా తీసారు అంటే ఇప్పటికీ ఆశ్చర్యమే.

ఈ సినిమా ఎందుకు బాలేదు? 
ఈ సినిమా డైరెక్టర్ కరుణాకరన్ 'జస్ట్ లైక్ హెవెన్' అనే హాలీవుడ్ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. కాని ఆ సినిమాని తెలుగుకి అడాప్ట్ చేసే విషయంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు వదిలేసి దిక్కుమాలిన ఆత్మ కాన్సెప్ట్ హైలెట్ చేసాడు. ఇప్పటివరకు చనిపోయిన వారి బాడీ నుండి ఆత్మ రావడం చూసాం కాని ఈ సినిమాలో కోమాలోకి వెళ్ళిన స్రవంతి బాడీలో నుండి ఆత్మ రావడం చూస్తాం. ఆ ఆత్మ తన గోడు అందరితో చెప్పుకోవడానికి ట్రై చేయడం, తన బాధ ఎవ్వరికీ అర్ధం కావట్లేదు అని "ఆత్మ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం" వంటి సీన్స్ రాసుకున్న దర్శకుడికి కోటి దండాలు. రామ్ మేనత్త "ఆత్మని అవమానించడం ఆ ఆత్మ ఆత్మాభిమానంతో భాధపడటం" అబ్బో ఇలాంటి దరిద్రాలు చాలా ఉన్నాయి. చెప్పడం మరిచానండోయ్ "ఆత్మ హీరో గారితో డ్రీం సాంగ్స్ కూడా పాడుకుంటుంది". ఇలాంటి దరిద్రాలు అరుదుగా వస్తుంటాయి. పారిసులో ఉండే ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ కూతురు కనిపించకుండా పోతే కనిపెట్టడం అయన వల్ల కాదు.  లాజిక్ లేకుండా ఈ సినిమా చూద్దామన్నమన ఆత్మ అంగీకరించని పరిస్థితి. క్లైమాక్సులో స్రవంతి కోమాలో నుండి బైటకి రావడం ఆత్మ మాయం అవడం, కోమా నుండి బయటికి వచ్చిన స్రవంతికి ఏమీ గుర్తులేకపోవడం, తన డ్రీం బాయ్ కనపడగానే వెళ్లి ఐ లవ్ యు చెప్పి చేయి పట్టుకోగానే గతం అంతా గుర్తు రావడం, వామ్మో వాయ్యో ఇలా చెప్పుకుంటే పేజీలు సరిపోవు అసలు.

చివరగా ...
ఎందుకంటే ప్రేమంట సినిమా సినిమా చూసిన వాడి  ఖర్మంట

You are receiving this email because you subscribed to this feed at blogtrottr.com.

If you no longer wish to receive these emails, you can unsubscribe from this feed, or manage all your subscriptions

0 comments:

Blog Archive